News February 18, 2025

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: అడిషనల్ కలెక్టర్

image

విద్యార్థులకు విద్యతోపాటు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని, విద్యార్థులకు న్యాయమైన భోజనం అందించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ అన్నారు. స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. కామన్ మెనూ పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ప్రిన్సిపల్ కృతమూర్తికి ఆయన సూచించారు.

Similar News

News September 19, 2025

క్రికెట్ ఆడిన ఆదిలాబాద్ SP

image

జిల్లా స్థాయిలో పోలీసులకు క్రికెట్ టోర్నమెంట్ పూర్తయినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ మైదానంలో నాలుగు రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్‌‌ను పోలీసు ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించారు. చివరి రోజు ముగింపు కార్యక్రమ సందర్భంగా గెలుపొందిన సూపర్ స్ట్రైకర్స్ బృందానికి మొదటి బహుమతి, రన్నరప్‌గా నిలిచిన ఆదిలాబాద్ రాయల్స్ బృందానికి 2వ బహుమతిని అందజేశారు.

News September 19, 2025

తలమడుగు: కలప అక్రమ రవాణా

image

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలపను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. గురువారం పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో దేవాపూర్ సమీపంలోని MS గార్డెన్‌లో సిబ్బంది తనిఖీలు చేశారు. రూ.84 వేల విలువైన టేకు కలప దొరికినట్లు చెప్పారు. కలపను జప్తు చేసి యజమాని మొహమ్మద్ మూసా, లక్షణ్ పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

News September 19, 2025

SRPT: ‘సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించాలి’

image

భూ భారతి చట్టం అమలులో భాగంగా సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించి నోటీసులు జారీ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ కే.సీతారామారావు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం ఆర్డీవోలు, తహశీల్దార్లతో రెవెన్యూ అంశాలపై ఆయన వెబ్‌ఎక్స్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవోలు, తహశీల్దార్లతో పాటు ఈ-సెక్షన్ సూపరింటెండెంట్ సాయి గౌడ్, డీటీ వేణు తదితర అధికారులు పాల్గొన్నారు.