News February 18, 2025

వేములవాడలో 3 రోజులు జాతర.. మీరు వెళుతున్నారా?

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి జాతర మహోత్సవాలు ఈనెల 25 నుంచి 27 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. 25న రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారికి వస్త్రాలంకరణ, కోడె మొక్కులు నిర్వహిస్తారు. 26న మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 27న స్వామివారి ఆర్జిత సేవలు ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Similar News

News January 4, 2026

KNR: ప్రత్యేక బస్సు కోసం మంత్రికి వినతి

image

కరీంనగర్‌లోని ప్రధాన విద్యాసంస్థలు, పర్యాటక ప్రాంతాలైన ఉజ్వల పార్క్, పాలిటెక్నిక్, శాతవాహన ఫార్మసీ కళాశాల మార్గంలో ప్రత్యేక ఆర్టీసీ బస్సును నడపాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ కోరారు. విద్యార్థులు, ఉద్యోగుల రవాణా ఇబ్బందులపై ఆయన వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన మంత్రి, తక్షణమే ఈ రూట్‌లో బస్సు సర్వీసును పరిశీలించి ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News January 4, 2026

KNR: డ్రైవర్లకు సీపీఆర్ శిక్షణ, ఉచిత వైద్య శిబిరం

image

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం KNR జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో 200 మంది డ్రైవర్లకు సీపీఆర్ శిక్షణ, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డీటీసీ పి.పురుషోత్తం మాట్లాడుతూ.. ఆరోగ్యవంతులైన డ్రైవర్లతోనే సురక్షిత ప్రయాణం సాధ్యమన్నారు. అకస్మాత్తుగా గుండె ఆగిపోయిన వారికి సీపీఆర్ ద్వారా ప్రాణదానం చేయవచ్చని డాక్టర్ ప్రణవ్ వివరించారు. శిబిరంలో డ్రైవర్లకు కంటి పరీక్షలు, జనరల్ చెకప్ నిర్వహించారు.

News January 4, 2026

KNR: మహిళా, మైనారీటీ పథకాలకు ధరఖాస్తుల ఆహ్వానం

image

మైనారీటి ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 2 పథకాలకు ధరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారీటి సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్ కిరణ్ తెలిపారు. వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, అనాధలు, అవిహితులు, చిరు వ్యాపారులకు రూ.50 వేలు, ఫఖీర్, దూదేకుల వర్గాలకు మోపడు వాహనాలకు రూ.లక్ష ఇస్తారని చెప్పారు. అర్హులు ఈ నెల 10లోగా ఆన్లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 0878-2957085 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.