News February 18, 2025
వేములవాడలో 3 రోజులు జాతర.. మీరు వెళుతున్నారా?

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి జాతర మహోత్సవాలు ఈనెల 25 నుంచి 27 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. 25న రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారికి వస్త్రాలంకరణ, కోడె మొక్కులు నిర్వహిస్తారు. 26న మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 27న స్వామివారి ఆర్జిత సేవలు ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Similar News
News July 9, 2025
గిరి ప్రదక్షిణలో మాధవ స్వామి ఆలయానికి వెళ్తున్నారా..!

సింహాచలం గిరి ప్రదక్షిణ బుధవారం ఉదయం నుంచి ప్రారంభం అయ్యింది. భక్తులు ఇప్పటికే నడక ప్రారంభించారు. అయితే మాధవధారలో సింహాచలం కొండను అనుకోని ఉన్న మాధవస్వామి ఆలయాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకొని గిరి యాత్ర కొనసాగించాలి. అప్పుడు మాత్రమే గిరి ప్రదక్షిణ సంపూర్ణం అవుతుందని పెద్దలు చెబుతున్నారు. అయితే మాధవస్వామి ఆలయం నుంచి మెట్ల మార్గాన సింహాచలానికి దారి కూడా ఉంది.
News July 9, 2025
సీఎం బందోబస్తుకు వచ్చిన పోలీసులకు ఎస్పీ దిశానిర్దేశం

సీఎం పర్యటనకు బందోబస్తుగా వచ్చిన పోలీసులకు ఎస్పీ వి.రత్న దిశానిర్దేశం చేశారు. పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కొత్తచెరువులో గురువారం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గట్టి బందోబస్తు నిర్వహించాలని పోలీసులు సూచించారు.
News July 9, 2025
కాన్వాయ్ ఆపితే SPని తొక్కిస్తారా: MLA మురళీ

YS జగన్ కాన్వాయ్ ఆపితే SPని తొక్కిస్తారా అంటూ పూతలపట్టు MLA మురళీ మోహన్ మండిపడ్డారు. జగన్ పర్యటనలో ఓ విలేకరి గాయపడ్డట్లు పేర్కొన్నారు. ‘మీ పర్యటన సందర్భంగా మీడియాపై ఆంక్షలు విధించారా? కాన్వాయ్ ఆపితే SPని తొక్కించమని చెబుతారు. పెద్దిరెడ్డి DSP చేయి నరకమని పురమాయిస్తారు. ఒక్క రైతు, ఫ్యాక్టరీ యాజమాని లేకుండా ఆయన పర్యటన జరిగింది. జనం తొక్కడంతో టన్నుల పంట నాశనం అయింది’ అంటూ ఆయన ఓ మీడియాతో మాట్లాడారు.