News February 18, 2025
ఏయూ వైస్ ఛాన్స్‌లర్‌కి విశాఖతో అనుబంధమిదే..!

ఏయూ వైస్-చాన్సలర్‌గా మంగళవారం నియామకం అయిన రాజశేఖర్ విశాఖలో విద్యాభ్యాసం చేశారు. విశాఖలో సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్‌లో పదోతరగతి పూర్తి చేశారు. ఏ.వి.ఎన్. కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయనను ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా నియమించారు. అయితే విశాఖతో అనుబంధం ఉన్న వ్యక్తిని వైస్ ఛాన్సలర్‌గా నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News February 22, 2025
VZM: అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

విజయనగరం జిల్లాలో టాయిలెట్లు, విద్యుత్ సౌకర్యం లేకుండా ఉన్న ప్రైవేటు భవనాల్లో ఉంటున్న అంగన్వాడీ కేంద్రాలను ఖాళీ చేయించాలని కలెక్టర్ అంబేద్కర్ అధికారులను ఆదేశించారు. వారిని కొత్త భవనాల్లోకి మార్చాలని విద్యుత్ శాఖా, విద్యాశాఖాధికారులకు ఆయన సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లోని మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయం లేని జాబితాను అందించాలన్నారు.
News February 21, 2025
విజయనగరం నుంచి కుంభమేళాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

మహా కుంభమేళాకు శుక్రవారం విజయనగరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి 70 మంది భక్తులతో రెండు సూపర్ లగ్జరీ బస్సులు బయలుదేరాయి. జిల్లా ప్రజా రవాణాధికారి సీ హెచ్. అప్పలనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. కుంభమేళా త్రివేణి సంగమం దర్శించుకుని 27వ తేదీన విజయనగరం చేరుకుంటారని డిపో మేనేజరు శ్రీనివాసరావు తెలిపారు. ఆర్టీసీ ఆదరించిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
News February 21, 2025
విజయనగరం జిల్లాలో బర్డ్ ఫ్లూ లేదు: జేడీ

విజయనగరం జిల్లాలో బర్డ్ ఫ్లూ లేదని పశుసంవర్ధక శాఖ జేడీ వైవీ రమణ స్పష్టం చేశారు. కోళ్ల ఫారాల్లో జీవభద్రత చర్యలపై అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ‘జిల్లాలో గుడ్లు, మాంసం రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేవు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి ప్రయత్నిస్తున్నాం. అందరూ చికెన్, గుడ్లు తినవచ్చు’ అని జేడీ సూచించారు. డాక్టర్ మహాలక్ష్మి, డాక్టర్ ఎంబీవీ ప్రకాశ్ పాల్గొన్నారు.