News March 21, 2024
కర్నూలు: ఆ అభ్యర్థులకు పోటీ ప్రత్యర్థులతో కాదు.. అసమ్మతితో

కర్నూలు జిల్లాలో ఇరు పార్టీల అభ్యర్థులకు సంకట పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల్లో ప్రత్యర్థులతో పోరాడాల్సిన వారు తమ పార్టీకి చెందిన టికెట్ దక్కని అసమ్మతి నేతలతోనే పోటీ పడుతున్నారు. ఆలూరు వైసీపీ అభ్యర్థి విరుపాక్షి.. గుమ్మనూరు వర్గంతోను, మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర తిక్కారెడ్డి వర్గంతో, కోడుమూరు టీడీపీ అభ్యర్థి దస్తగిరి ఆకేపోగు ప్రభాకర్ వర్గంతోను పోటీ పడుతున్నారు.
Similar News
News April 3, 2025
కొత్త జంటకు వైఎస్ జగన్ ఆశీర్వాదం

కోడుమూరు వైసీపీ నేత, కుడా మాజీ ఛైర్మన్ కోట్ల హర్షవర్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు మాజీ సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. కర్నూలులోని జీఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వివాహా వేడుకలో నూతన వధూవరులు శ్రేయ, వివేకానంద విరూపాక్షలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ వేడుకలో జిల్లా వైసీపీ నేతలు పాల్గొన్నారు.

నేడు కర్నూలుకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు కర్నూలుకు రానున్నారు. ఉ.9.30 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11.30 గంటలకు కర్నూలుకు చేరుకుంటారు. అనంతరం నగర శివారులోని జీఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో వైసీపీ నేత కోట్ల హర్షవర్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొంటారు. వధూవరులను ఆశీర్వదించిన తర్వాత జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. మ.12.50 గంటలకు తాడేపల్లికి తిరుగుపయనం అవుతారు.