News March 21, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌కి షాక్

image

విశాఖ ఉక్కును విద్యుత్ బిల్లుల గండం మరింత భయపెడుతోంది. బాయిలర్ బొగ్గు కొరతతో ప్లాంట్‌లోని 315 మెగావాట్ల సొంత థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. ఈపీడీసీఎల్ నుంచి విద్యుత్‌ని ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం చెల్లించాల్సిన బకాయిలు రూ.60 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. ఇవి చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తామంటూ ఈపీడీసీఎల్ హెచ్చరిస్తూ నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది.

Similar News

News February 3, 2026

గాజువాక: సచివాలయ ఉద్యోగిని పట్టుకున్న ఏసీబీ

image

గాజువాకలోని 74వ వార్డులో సచివాలయం అడ్మిన్ కార్యదర్శి రూ.16 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం సాయంత్రం నిఘా పెట్టి ఏసీబీ అధికారులు దాడి చేశారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

News February 2, 2026

కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు మత్స్యకారుల కృతజ్ఞతలు

image

బంగ్లాదేశ్ నుండి సురక్షితంగా స్వదేశం చేరుకున్న 9 మంది మత్స్యకారులు సోమవారం విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. విదేశీ వ్యవహారాల శాఖతో సమన్వయం చేసి, తమను ప్రాణాపాయం నుండి కాపాడినందుకు వారు భావోద్వేగానికి లోనయ్యారు. మత్స్యకారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్, భవిష్యత్తులో సరిహద్దుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

News February 2, 2026

విశాఖ:100 రోజులు బంగ్లాదేశ్‌లో బందీలుగా

image

విశాఖ నుంచి వేటకు వెళ్లిన 9 మంది మత్స్యకారులు పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లో చొరబడటంతో<<19027027>> 100 రోజులు బందీలుగా<<>> అక్కడ వేదన జీవితాన్ని గడిపారు. సోమవారం విశాఖ చేరుకున్న వీరికి సంఘం పెద్దలు, కుటుంబ సభ్యులు సన్మానించి కన్నీటి పర్యంతం అయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో సుధాసాగర్ వీరికి నిత్యవసర సరకులు అందించారు.