News February 18, 2025

శ్రీశైలంలో విద్యుత్ కాంతులు

image

మల్లన్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీశైలం వీధులు విద్యుత్ దీప కాంతుల్లో వెలుగొందుతున్నాయి. మిరుమిట్లు గొలిపే రంగురంగుల విద్యుత్ దీపాలతో శ్రీశైలంలోని వీధులను చూడముచ్చటగా తీర్చిదిద్దారు. శ్రీశైల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాడవీధుల్లో వివిధ ఆకృతుల్లో ఏర్పాటుచేసిన డెకరేషన్ లైట్లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విద్యుత్ దీపాలతో శ్రీశైలం కొత్త శోభను సంతరించుకుంది.

Similar News

News November 27, 2025

ఖమ్మం: 50 వేల మంది మహిళలకు ‘ఉల్లాస్‌’ వెలుగులు

image

15 ఏళ్లు నిండిన నిరక్షరాస్యులైన మహిళలకు సంపూర్ణ అక్షరాస్యత కల్పించేందుకు కేంద్రం ‘ఉల్లాస్‌’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద జిల్లాలోని డ్వాక్రా మహిళల్లో 50 వేల మందికి పైగా అక్షరాస్యులు కానీ వారిని గుర్తించారు. వీరికి చదవడం, రాయడంతో పాటు జీవన నైపుణ్యాలు నేర్పడానికి ప్రతి 10 మందికి ఒక వలంటీర్‌ను నియమించి, అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీల్లో శిక్షణ ఇస్తున్నారు.

News November 27, 2025

వరంగల్: నేడే మంచి రోజు.. భారీ నామినేషన్లకు అవకాశం!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 1683 గ్రామ పంచాయతీల్లో ఈసారి సర్పంచ్‌గా నిలబడి గ్రామానికి సేవ చేయాలనే ఆశతో ఎన్నో ఏళ్లుగా పూజలు, వ్రతాలు చేస్తూ పార్టీ కోసం కష్టపడుతున్న స్థానిక నాయకుల్లో నామినేషన్ ఉత్సాహం ఉప్పొంగుతోంది. గురువారం శుభముహూర్తం చివరి రోజు కావడం, రేపటి నుంచి మూడాళ్లు ప్రారంభం అవుతున్నాయి. దీంతో, భారీ సంఖ్యలో నామినేషన్లు నేడే వేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

News November 27, 2025

విజయనగరం: ఒకరి బ్లడ్ గ్రూప్ రక్తం మరొకరికి ఎక్కించారు!

image

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 25న సర్జరీ కోసం సూరమ్మ అనే పేరు కలిగిన ఇద్దరు రోగులు చేరారు. అయితే ఒకే పేరు కావడంతో వైద్య సిబ్బంది వారికి బ్లడ్ ఎక్కించే సమయంలో గందరగోళానికి గురయ్యారు. ఒకరి బ్లడ్ గ్రూప్ రక్తాన్ని మరొకరికి ఎక్కించారు. O పాజిటివ్ మహిళకు B పాజిటివ్, B పాజిటివ్ మహిళకు O పాజిటివ్ ఎక్కించారు. వెంటనే తప్పును గుర్తించి వారికి చికిత్స అందించారు. దీనిపై సూపరింటెండెంట్ డా.పద్మజ విచారణ చేపట్టారు.