News February 19, 2025

మరో ఐదు జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ

image

TG: మూడో విడతలో ఐదు జిల్లాలకు అధ్యక్షులను బీజేపీ ప్రకటించింది. నారాయణ పేటకు సత్యయాదవ్, సూర్యాపేటకు శ్రీలత రెడ్డి, నిర్మల్‌కు రితేశ్ రాథోడ్, సిద్దిపేటకు బైరి శంకర్ ముదిరాజ్, రాజన్న సిరిసిల్లకు గోపి ముదిరాజ్‌ను నియమిస్తున్నట్లు తెలిపింది. సంస్థాగతంగా తెలంగాణలో బీజేపీకి 38 జిల్లాలు ఉన్నాయి. వీటిలో మూడు విడతల్లో 28 జిల్లాలకు అధ్యక్షులను నియమించింది.

Similar News

News March 12, 2025

భయమనేది నా రక్తంలోనే లేదు: విజయసాయి

image

AP: కాకినాడ పోర్టు కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలోని సీఐడీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు. ‘కావాలనే కొందరు నన్ను ఈ కేసులో ఇరికించారు. కేవీ రావుతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. ఆయనంటేనే నాకు అసహ్యం. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అన్నీ విక్రాంత్ రెడ్డే. కొందరు ఎదగడానికి నన్ను కిందకు లాగారు. భయమనేది నా రక్తంలోనే లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News March 12, 2025

ఉద్యోగం కోసం నిరుద్యోగుల క్యూ!

image

ఓ వైపు 40+ డిగ్రీల ఎండ. ఎప్పుడు లోపలికి పిలుస్తారో తెలియదు. కానీ, ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో గంటల తరబడి లైన్‌లో వేచి ఉన్నారీ నిరుద్యోగులు. ఈ దృశ్యం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అమెజాన్ కంపెనీ వద్ద కనిపించింది. ఇంటర్వ్యూ కోసం ఇంతమంది రావడంతో నిరుద్యోగం ఎంతలా పెరిగిందో చూడాలంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ కంపెనీల వద్ద ఇలాంటి దృశ్యాలు కనిపిస్తూనే ఉంటాయని చెబుతున్నారు.

News March 12, 2025

పబ్లిక్ ప్లేసెస్‌లో ఈ టైల్స్‌ను గమనించారా?

image

రైల్వే & మెట్రో స్టేషన్లు, బస్టాండ్స్, ఫుట్‌పాత్, ఆసుపత్రులు వంటి పబ్లిక్ ప్లేసెస్‌లో పసుపు రంగులో ఉండే స్పెషల్ టైల్స్‌ కనిపిస్తుంటాయి. ఇవి అక్కడ ఎందుకున్నాయో తెలుసా? వీటిని జపాన్ వ్యక్తి సెయీచీ మియాకే తన బ్లైండ్ ఫ్రెండ్ కోసం డిజైన్ చేయగా ఇప్పుడు ప్రపంచమంతా వినియోగిస్తున్నారు. ఈ టైల్స్‌లో డాట్స్ & స్ట్రైట్ లైన్స్ ఉంటాయి. లైన్స్ ఉంటే ముందుకు వెళ్లొచ్చని, డాట్స్ ఉంటే జాగ్రత్తగా ఉండాలని అర్థం.

error: Content is protected !!