News February 19, 2025
నిర్మల్: విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు: కలెక్టర్

జిల్లాలో వ్యవసాయ రంగానికి, త్రాగునీటికి, నిర్మాణ రంగానికి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లాలో విద్యుత్ వినియోగంపై అధికారులతో సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. రైతు భరోసా పథకం క్రింద అర్హులైన అందరికీ పథకం అందించే విధంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
Similar News
News November 11, 2025
జూబ్లీహిల్స్ పోలింగ్ అప్‌డేట్స్

✦ మ.3 గంటల వరకు 40.20% ఓటింగ్ నమోదు.. సా.6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
✦ కాంగ్రెస్ నేతలు నగదు పంచుతూ ఓటర్లను భయపెడుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. రౌడీయిజం చేస్తున్న వారి సంగతి 14వ తేదీన చెప్తా: మాగంటి సునీత
✦ ప్రజాస్వామ్యం పట్ల గౌరవాన్ని ఆచరించేది కాంగ్రెస్.. ఓడిపోతున్నామని అసహనంతో BRS అభ్యర్థి మూడు రోజులుగా ఏది పడితే అది మాట్లాడుతున్నారు: మంత్రి పొన్నం
News November 11, 2025
రాజమండ్రి, కాకినాడ రైళ్లు రద్దు

విజయవాడ-దువ్వాడ సెక్షన్ల మధ్య రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఈనెల 20న నాలుగు రైళ్లను రద్దు చేశారు. కాకినాడ పోర్ట్-విశాఖ(17267), విశాఖ-కాకినాడ పోర్ట్(17268), రాజమండ్రి-విశాఖ(67285), విశాఖ-రాజమండ్రి(67286) రైళ్లు ఆ తేదీన తిరగవు. ప్రయాణికులు గమనించాలని రైల్వే శాఖ కోరింది.
News November 11, 2025
వీరు వేగంగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు!

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఏడాదిలోపు పిల్లలు ఉంటే వేగంగా దర్శనం చేసుకోవచ్చు. సుపథం ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేక కౌంటర్ ఉంటుంది. దర్శన సమయం 12PM నుంచి సాయంత్రం 6 వరకు ఉంటుంది. దీనికి ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్ అవసరం లేదు. నేరుగా సుపథం వద్దకు వెళ్లి పిల్లల జనన ధ్రువీకరణ పత్రం & తల్లిదండ్రుల ఆధార్ కార్డులు సమర్పిస్తే చాలు. వీరితోపాటు 12ఏళ్లలోపు తోబుట్టువును అనుమతిస్తారు. share it


