News February 19, 2025

నుమాయిష్‌లో సింగరేణి సేవా సమితి స్టాల్‌కు ద్వితీయ బహుమతి

image

హైదరాబాద్‌లోని జరిగిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)లో సింగరేణి సేవా సమితి ఏర్పాటు చేసిన మహిళా శక్తి మార్కెట్ స్వయం ఉపాధి ఉత్పత్తుల స్టాల్‌కు ద్వితీయ బహుమతి లభించింది. నుమాయిష్‌లో 2200కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేయగా, ప్రభుత్వ విభాగంలో సింగరేణి సేవా సమితి స్టాల్‌కు బహుమతి లభించింది. ఈ సందర్భంగా సంస్థ సీ అండ్ ఎండీ బలరామ్ మాట్లాడుతూ నుమాయిష్‌లో సంస్థకు గుర్తింపు రావడం అభినందనీయమన్నారు.

Similar News

News January 16, 2026

శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

image

AP: సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి సర్వదర్శనానికి 18 గంటల వరకు టైమ్ పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి శిలా తోరణం వరకు క్యూ లైన్ ఉంది. గురువారం వేంకటేశ్వరుడిని 64,064 మంది దర్శించుకోగా 30,663 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.80కోట్లు ఆదాయం వచ్చిందని TTD ప్రకటించింది.

News January 16, 2026

BREAKING: NGKL జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

image

నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దపూర్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన లారీ.. RTC బస్సును, బైకును ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 16, 2026

ఇరాన్ వీధుల్లో అద్దె సైనికులు

image

ఇరాన్‌లో కొనసాగుతున్న నిరసనలను అణిచివేయడానికి ఖమేనీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశీయ భద్రతా బలగాలపై నమ్మకం తగ్గడంతో ఇరాక్ నుంచి కిరాయికి యువకులను రప్పించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. యాత్రికుల ముసుగులో వీరంతా ఇరాన్‌లోకి చొరబడుతున్నారని, అనంతరం నిరసనకారులపై హింసకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. హెజ్బొల్లా గ్రూప్ వంటి వారు ఇందులో ఉన్నట్లు సమాచారం.