News February 19, 2025

బ‌హుళ పంట‌ల విధానంపై రైతుల్లో చైత‌న్యం: కలెక్టర్

image

లాభ‌దాయ‌క సాగు విధానాల‌పై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని వ్య‌వ‌సాయ అనుబంధ శాఖ‌ల‌ అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ప్ర‌కృతి సేద్యానికి, మిల్లెట్లు, బ‌హుళ పంట‌ల సాగుకు ప్రాధాన్య‌త ఇవ్వాల‌న్నారు. గ్రామాలల్లో ప్ర‌తి ఇంటి వ‌ద్దా కంపోస్ట్ పిట్ ఏర్పాటు, కిచెన్ గార్డెన్ల పెంప‌కం చేసేలా అవ‌గాహ‌న కల్పించాలన్నారు.

Similar News

News February 21, 2025

భూకుంభకోణాలపై విచారణ నివేదికలను బహిర్గతం చేయాలి: బొత్స

image

విశాఖలో జరిగిన భూకుంభకోణాలపై విచారణ నివేదికలను బహిర్గతం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని బొత్స సత్యనారాయణ అన్నారు. బురదజల్లడం కాదు, ఆరోపణలు నిరూపించాలన్నారు. అటు జెడ్ కేటగిరీలో వున్న జగన్ భద్రత ఎందుకు కుదిరించారు అని గవర్నర్ ఆశ్చర్య పోయారన్నారు. జగన్ మిర్చి యార్డ్ కు వెళ్ళిన తర్వాత మిర్చి రైతుల ఆవేదన ఈ ప్రభుత్వానికి తెలిసిందన్నారు.

News February 21, 2025

పద్మనాభం: వేదవ్యాస్‌కు రెండో పతకం

image

చండీగఢ్‌లో నిర్వహిస్తున్న అఖిల భారత సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన వేదవ్యాస్‌ కాంస్య పతకం సాధించాడు. శుక్రవారం నిర్వహించిన 1000 మీటర్ల పరుగు పోటీలో 34 నిమిషాల 55 సెకన్లలో గమ్యాన్ని చేరి కాంస్య పతకం సాధించాడు. వేదవ్యాస్ వరుసగా రెండు పతకాలు సాధించడంతో పొట్నూరు ప్రజలు అభినందించారు. ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని ఆ గ్రామ ప్రజలు కోరుకున్నారు.

News February 21, 2025

విశాఖ: ఆర్డీఓపై చర్యలు చేపట్టాలి: ఏపీయూడబ్ల్యూజే

image

విశాఖ ఆర్డీఓ శ్రీలేఖపై ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని అనకాపల్లి జిల్లా ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు పెంటకోట జోగినాయుడు, కార్యదర్శి కె.చంద్ర రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నేతలంతా కలెక్టర్ విజయకృష్ణణ్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదిచ్చారు. సంఘం రాష్ట్ర నాయకులు స్వామి, కిషోర్, మద్దాల రాంబాబు, ఆళ్ల వెంకట అప్పారావు, అనకాపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మళ్ల భాస్కరరావు పాల్గొన్నారు.

error: Content is protected !!