News March 21, 2024
ధాన్యం దారులన్నీ మిర్యాలగూడ వైపే..
ఉమ్మడి నల్గొండ ధాన్యం దారులన్నీమిర్యాలగూడ వైపే వెళ్తున్నాయి. సన్నరకాల కొనుగోలు ఎక్కువగా ఉండడంతో రైతులు అక్కడికి ధాన్యం తరలిస్తున్నారు. ఇక్కడ దాదాపు 115 మిల్లులు ఉండడం, ధర అనుకూలంగా ఉండడంతో రైతులు మిర్యాలగూడకే తీసుకొస్తున్నారు. నల్గొండ జిల్లాలోని తిప్పర్తి వరకు, సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, అటు సాగర్ నుంచి కోదాడ వరకు సాగైన సన్నాలు తరలివస్తున్నాయి.
Similar News
News January 21, 2025
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ కౌంటర్.. నల్గొండ జిల్లా వాసి మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబాద్‌లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ నల్గొండ జిల్లాకు చెందిన మావోయిస్ట్ మృతి చెందారు. చండూరు మం. పుల్లెంలకు చెందిన పాక హన్మంతు మరణించినట్టు ఛత్తీస్‌గఢ్ పోలీస్ అధికారులు వెల్లడించారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. 45 ఏళ్ల క్రితం హనుమంతు మావోయిస్టు పార్టీలోకి వెళ్లారు. నల్గొండలోని ABVP నాయకుడు శ్రీనివాస్ హత్యలో హనుమంతు నిందితుడుగా ఉన్నాడు.
News January 21, 2025
NLG: ఆస్తులు అమ్మి పంపాం: రవితేజ తండ్రి
అమెరికాలో దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లో NLG జిల్లాకు చెందిన రవితేజ <<15210729>>దారుణ హత్యకు<<>> గురైన సంగతి తెలిసిందే. ‘HYDలో క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాను. ఉన్న పొలాన్ని మొత్తం అమ్మి రవితేజను ఉన్నత చదువుల కోసం 2022లో అమెరికా పంపాం. MS పూర్తి చేసిన రవితేజ ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. తాత్కాలికంగా ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తూ ఫుడ్ డెలివరీ చేసి వస్తుండగా ఈ ఘటన జరిగింది’ అని రవితేజ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
News January 21, 2025
దుశ్చర్లకు ప్రతిష్ఠాత్మక అవార్డు
తనకున్న 70 ఎకరాల విస్తీర్ణంలో అడవిని సృష్టించిన సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవపురానికి చెందిన దుశ్చర్ల సత్యనారాయకు తెలంగాణ గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ 2024 అవార్డు వరించింది. వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డు అందిస్తారు. గవర్నర్ జిష్ణుదేశ్ వర్మ ఈనెల 26న అవార్డును ప్రదానం చేయనున్నారు. రూ.2లక్షల నగదు, జ్ఞాపిక అందజేస్తారు.