News February 19, 2025

కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా పరీక్షలు జరపండి: కలెక్టర్

image

రంపచోడవరంలో ఇంటర్, టెన్త్ పరీక్షలపై అల్లూరి జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో సమీక్ష జరిపారు. అల్లూరి జిల్లాలో మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పరీక్షలు విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. మంచి ఫలితాలు వచ్చేలా అందరు కృషి చేయాలన్నారు. ప్రతీ రోజు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.

Similar News

News March 2, 2026

పర్యావరణ హితంగా హోళీ జరుపుకోండి: ASF SP

image

హోళీ పండుగను ప్రకృతి సిద్ధమైన రంగులతో సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా SP నితిక పంత్ ప్రజలకు సూచించారు. రసాయన రంగుల వల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముందని, పర్యావరణ హిత రంగులనే వాడాలని కోరారు. ఇతరుల ఇష్టాయిష్టాలను గౌరవిస్తూ వేడుకలు చేసుకోవాలన్నారు. బలవంతపు చందాలకు పాల్పడినా, నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలన్నారు.

News March 2, 2026

ఇజ్రాయెల్ దాడులు.. ‘హెజ్బొల్లా’పై లెబనాన్ నిషేధం

image

లెబనాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోని షియా ఇస్లామిస్ట్ పొలిటికల్ పార్టీ అయిన ‘హెజ్బొల్లా’ మిలిటరీ, సెక్యూరిటీ కార్యకలాపాలపై నిషేధం విధించింది. రాజకీయాలకే పరిమితం కావాలని, వెంటనే ఆయుధాలు సరెండర్ చేయాలని పీఎం నవాఫ్ సలాం ఆదేశించారు. కాగా హెజ్బొల్లా గ్రూప్ ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో ఇజ్రాయెల్ లెబనాన్ రాజధాని బీరుట్‌పై విరుచుకుపడుతోంది. దీంతో లెబనాన్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

News March 2, 2026

MBNR: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

image

మహబూబ్ నగర్ జిల్లాలో హోలీ పండుగను సహజ రంగులతో ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ డి.జానకి సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపడం, బలవంతంగా రంగులు చల్లడం, ర్యాష్ డ్రైవింగ్ వంటి చర్యలు చేయరాదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర సమయంలో డయల్- 100 లేదా 8712659360 ను సంప్రదించాలని చెప్పారు. జిల్లా ప్రజలకు ఎస్పీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.