News February 19, 2025
10th పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు: కలెక్టర్

తిరుపతి జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంగళవారం కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎక్కడా కూడా మాస్ కాపీయింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే ఎలాంటి పొరపాట్లు లేకుండా పరీక్షలు నిర్వహించాలని అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు.
Similar News
News November 16, 2025
టెస్టుకు దూరమైన గిల్

టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. దీంతో సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆయన పాల్గొనరని BCCI వెల్లడించింది. రెండో రోజు బ్యాటింగ్ చేస్తూ గిల్ మెడనొప్పితో మైదానాన్ని వీడారు. అటు ఇవాళ మూడో రోజు ఆట ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్సులో సౌతాఫ్రికా స్కోర్ 93/7గా ఉంది.
News November 16, 2025
ఫోన్ కోసం అలిగి.. బాలుడు అదృశ్యం: ఎస్ఐ

సెల్ ఫోన్ చూడవద్దని తల్లి మందలించడంతో ఓ బాలుడు (11) అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన నరసాపురంలో చోటుచేసుకుంది. ఈ నెల 14న బాలుడు ఫోన్ పగులగొట్టి వెళ్లిపోయాడని, తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై జయలక్ష్మి తెలిపారు. బాలుడి ఆచూకీ కోసం పట్టణం, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు వివరించారు.
News November 16, 2025
పెద్దపల్లి: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

పెద్దపల్లి జిల్లా అంతర్గాం, ముత్తారం మంథని, కమాన్ పూర్, సుల్తానాబాద్, జూలపల్లి, ఎలిగేడు మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <


