News February 19, 2025

ఒంగోలు: రెవెన్యూ సదస్సుల అర్జీలపై నిర్లక్ష్యం వద్దు

image

రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకూడదని తహశీల్దార్లకు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సూచించారు. మంగళవారం ఒంగోలు ఆర్డీవో కార్యాలయంలో ఒంగోలు, కొత్తపట్నం, చీమకుర్తి, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు మండల తహశీల్దార్లతో జేసీ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవిన్యూ సదస్సులు నిర్వహించినందున, వచ్చిన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని JC ఆదేశించారు.

Similar News

News September 12, 2025

ప్రకాశం: బార్ల లైసెన్సులకు గడువు పొడిగింపు

image

ప్రకాశం జిల్లాలోని 4 ఓపెన్ కేటగిరి బార్ల లైసెన్సులకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2, మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో 2 ఓపెన్ బార్ల లైసెన్స్‌ల కొరకు దరఖాస్తు గడువు గతంలో 14వ తేదీ వరకు నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆ గడువు తేదీని 17 వరకు పొడిగించామన్నారు.

News September 12, 2025

ఉలవపాడు: బాలికపై సచివాలయం ఉద్యోగి అత్యాచారం

image

ఉలవపాడులో ఇటీవల ఓ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన గురువారం వెలుగు చూసింది. SI అంకమ్మ వివరాల ప్రకారం.. ఇటీవల అనాధగా కనిపించిన బాలిక(13)ను పోలీసులు సంరక్షించి అనాధ ఆశ్రమంలో చేర్చారు. సింగరాయకొండలో సచివాలయ ఉద్యోగిగా చేస్తున్న రామకృష్ణ ఇంట్లో బాలిక పనిమనిషిగా చేసింది. ఈక్రమంలో బాలికను బెదిరించి రామకృష్ణ అత్యాచారం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 12, 2025

ప్రకాశం: ప్లెక్సీ యజమానులకు, ప్రజలకు ఎస్పీ కీలక సూచన!

image

ఫ్లెక్సీల రూపంలో విద్వేషపూరిత వ్యాఖ్యలు, అనుచిత పదజాలంపై కఠిన చర్యలు తీసుకుంటామని SP దామోదర్ అన్నారు. గురువారం SP కార్యాలయంలో మాట్లాడుతూ.. డిజైన్ చేసే వారికి, ప్రజలకు, ప్రింటింగ్ ప్రెస్ వారికి సూచనలు చేశారు. ఫ్లెక్సీ పోస్టర్స్, ప్లకార్డుల రూపంలో వివాదాస్పద వ్యాఖ్యల వల్ల వర్గాల మధ్య విద్వేషాలను రేకెత్తిస్తున్నాయని, ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని పేర్కొన్నారు.