News February 19, 2025

మెదక్: యూనివర్సిటీ కోసం భూమి పరిశీలించిన కలెక్టర్

image

మెదక్ జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నిర్మాణానికి భూమిని గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళ వారం పాపన్న పేట మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నిర్మాణానికి భూమికి సంబంధించి వివిధ ప్రదేశాలను సంబంధిత ఆర్డీవో రమాదేవి, ఇన్ ఛార్జ్ తహశీల్దార్ మహేందర్ గౌడ్‌తో కలిసి పరిశీలించారు.

Similar News

News February 21, 2025

మెదక్‌లో గ్రాడ్యుయేట్స్ 12,472, టీచర్స్ 1,347 ఓటర్లు

image

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. ఈనెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మెదక్ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఓటర్లు 12,472 ఉన్నారు. ఇందులో 8,879 మంది పురుషులు, 3,593 మహిళలున్నారు. ఉపాధ్యాయ ఓటర్లు మొత్తం 1,347 ఉన్నారు. ఇందులో పురుషులు 7,99 మంది, మహిళలు 5,48 మంది ఉన్నారు. ఎమ్మెల్సీ పోలింగ్ కోసం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News February 21, 2025

మెదక్: భర్తను హత్య చేసిన భార్య.. UPDATE

image

<<15507715>>భర్తను హత్య చేసిన<<>> భార్య శివమ్మ, అల్లుడు రమేశ్‌లను గురువారం రిమాండ్‌కు తరలించినట్లు మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, పాపన్న పేటకు చెందిన ఆశయ్య ఈ నెల 15న పొలం వద్ద జారి పడగా కాలు విరిగింది. ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు భరించలేక, ఆపరేషన్ చేసినా నడిచి పొలం పనులు చేయలేడనే అనుమానంతో భార్య, అల్లుడు ఆశయ్యను ఉరేసి హత్య చేశారు. కేసులో భాగంగా ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు వివరించారు.

News February 21, 2025

MDK: వన దుర్గామాతను దర్శించుకున్న సినీహీరో

image

మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గాభవాని మాతను ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు, నటుడు పూరీ ఆకాశ్ గురువారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, సిబ్బంది స్వాగతం పలికారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

error: Content is protected !!