News February 19, 2025
టెక్కలి: జేసీ సమక్షంలో పెండింగ్ అర్జీల పరిష్కారం

టెక్కలి సబ్ కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి ఆధ్వర్యంలో టెక్కలి డివిజన్ పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ అర్జీలు సమస్యలను పరిష్కరించారు. డివిజన్ పరిధిలోని టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాలి, పాతపట్నం, హిరమండలం, ఎల్.ఎన్ పేట, కొత్తూరు, సారవకోట మండలాల తహశీల్దార్లు, వీఆర్ఓలు, సర్వేయర్ల సమక్షంలో 260 అర్జీలు పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News March 13, 2025
SKLM: మహిళల భద్రత కోసం శక్తి యాప్- ఎస్పీ

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మహిళలు, బాలికలు భద్రత కోసం శక్తి యాప్ (SHAKTI APP)ను ప్రవేశపెట్టిందని ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ యాప్ ప్రధానంగా మహిళలపై జరిగే వేధింపులు, అత్యాచారాలు, ఇతర హింసాత్మక ఘటనలను నివారించటానికి ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో ప్రతీ మహిళ శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
News March 13, 2025
SKLM: ఆత్మహత్యాయత్నం.. రక్షించిన ఆసుపత్రి సిబ్బంది

శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. గురువారం ఆసుపత్రి పైఫ్లోర్ నుంచి కిందకు దూకేందుకు యత్నించగా అక్కడి స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది హుటాహుటిన స్పందించి రక్షించారు. సదరు వ్యక్తి సరుబుజ్జిలి మండలం నక్కలపేట వాసిగా స్థానికులు చెబుతున్నారు. ఆత్మహత్యయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
News March 13, 2025
SKLM: హొలీ ప్రశాంత వాతావరణంలో జరగాలి: ఎస్పీ

మార్చి 14 తేదీ హోలీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలు రంగులు హోలీ పండుగ ప్రశాంత వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కెవీ మహేశ్వర రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. హోలీకి ప్రజలు ఎటువంటి గొడవలు అల్లర్లు సమస్యలు జోలికి వెళ్ళొదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించరాదని చెప్పారు. జిల్లా ప్రజలకు ముందస్తు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.