News February 19, 2025
సంగారెడ్డి: వేసవి త్రాగునీటి ప్రణాళికలు తయారు చేయాలి: కలెక్టర్

జిల్లాలో రాబోయే వేసవిలో త్రాగునీటి సమస్యలు లేకుండా ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ఎంపీడీవోలతో మంగళవారం కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మంచినీటి సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి నివేదికలు తయారు చేయాలని చెప్పారు. ఎక్కడైనా పైప్ లైన్ల రిపేర్లు ఉంటే మరమ్మత్తులు చేయాలని పేర్కొన్నారు.
Similar News
News January 9, 2026
యాదాద్రి: మదర్ డైరీ ఛైర్మన్‌గా ప్రభాకర్ రెడ్డి

నల్గొండ-రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తిదారుల మదర్ డైరీ ఛైర్మన్‌గా నిదానపల్లికి చెందిన మందడి ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కొన్ని రోజులుగా రాజుకున్న వివాదానికి.. ఇప్పటివరకు ఉన్న ఛైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి రాజీనామాతో తెరపడింది. రైతుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాడని, గుడిపాటి రాజీనామా చేయాలని ఇటీవలె 11 మంది డైరెక్టర్లు ధర్నా చేశారు. ఈ పరిణామంలో ఆయన రాజీనామా లేఖను ఎండీకి అందజేశారు.
News January 9, 2026
మాయదారి మాంజా.. బాలుడి మెడకు 16 కుట్లు

TG: సంక్రాంతి వేళ మాయదారి మాంజా పలువురి ఇళ్లలో విషాదం నింపుతోంది. ఇటీవల HYD శివారు కీసరలో చైనా మాంజా మెడకు తగిలి జశ్వంత్ అనే యువకుడికి 19 కుట్లు పడ్డాయి. తాజాగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లి దుబ్బవాడలో నాలుగేళ్ల చిన్నారి శ్రీహాన్‌కు తీవ్ర గాయమైంది. మాంజా దారం అతడి మెడను కోసేసింది. దీంతో వైద్యులు 16 కుట్లు వేశారు.
** మాంజా వాడకండి.. ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టకండి
News January 9, 2026
రాయవరానికి భారీగా తరలివచ్చిన టీడీపీ నాయకులు

సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో పర్యటించనున్నారు. ఈ బహిరంగ సభకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు భారీగా తరలివచ్చారు. సీఎం ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. సభా ప్రాంగణం పసుపుమయంగా మారింది.


