News February 19, 2025
‘అసంఘటిత కార్మికులను ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేయాలి’

అసంఘటిత కార్మికులను ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ కమిటీ, జిల్లా స్థాయి అమలు కమిటీతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఉన్న 2 లక్షల మంది అసంఘటిత కార్మికులను ఈ -శ్రమ్ పోర్టల్‌లో నమోదు ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు.
Similar News
News October 18, 2025
ఓయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా

HYD ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నేడు(శనివారం) జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా వేశామని ఓయూ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బీసీ సంఘాలు తలపెట్టిన తెలంగాణ బంద్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనేది తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని విద్యార్థులందరూ గమనించాలని సూచించారు.
News October 18, 2025
వరంగల్: ఆర్టీసీ డిపోల ఎదుట బైఠాయింపు

ఉమ్మడి WGL జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర బంద్ కొనసాగుతోంది. వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు భూపాలపల్లి జిల్లాల్లో ఉన్న ఆర్టీసీ బస్సు డిపోల ఎదుట బీసీ జేఏసీ నాయకులు బైఠాయించారు. బస్సులు బయటకు పోకుండా ఆర్టీసీ డిపో ముందు కూర్చుని ఆందోళన చేస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తుండగా, ప్రైవేటు పాఠశాలలు వాణిజ్య వ్యాపారులు మద్దతిచారు.
News October 18, 2025
నిద్రమత్తులోనే ఉండండి.. టీటీడీపై HC ఆగ్రహం

AP: పరకామణిలో అక్రమాల వ్యవహారంపై ఇటీవల పోలీస్ శాఖపై <<17999947>>విరుచుకుపడ్డ<<>> హైకోర్టు నిన్న టీటీడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి చర్యలు తీసుకోకుండా మరికొంత కాలం నిద్రమత్తులోనే ఉండండి అంటూ మండిపడింది. కౌంటర్ ఎందుకు వేయలేదని ఈవోపై ఆగ్రహించింది. తదుపరి విచారణకు తమ ముందు హాజరుకావాలని ఆయనను ఆదేశించింది. ఈనెల 27కు విచారణను వాయిదా వేసింది.