News February 19, 2025

20 సూత్రాల అమలుపై నేడు సమీక్ష

image

శ్రీ సత్యసాయి జిల్లాలో 20 సూత్రాల అమలుపై బుధవారం కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష జరుగుతుందని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు జరిగే సమావేశానికి 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ హాజరవుతారన్నారు. జిల్లాలోని ఎంపీతో పాటు అందరు ఎమ్మెల్యేలు పాల్గొంటారని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Similar News

News July 6, 2025

సూళ్లూరుపేట: ఐటీయూ డైరెక్టర్‌ పదవికి నామినేషన్‌

image

ఇంటర్నేషనల్‌ టెలీ కమ్యూనికేషన్‌ యూనియన్‌ రేడియో రెగ్యులేషన్స్‌ బోర్డు డైరెక్టర్‌గా భారత అభ్యర్థిగా సూళ్లూరుపేటకు చెందిన రేవతి మన్నెపల్లిని కేంద్రం నామినేట్‌ చేసింది. ఇస్రో, బార్క్‌ వంటి సంస్థల్లో సేవలందించిన ఆమె ప్రస్తుతం జెనీవాలో సభ్యురాలిగా ఉన్నారు. రేవతి JNTUHలో బీటెక్‌ పూర్తిచేశారు. అనంతరం ఇస్రోకు చెందిన షార్‌ కేంద్రంలో ఇంజినీర్‌గా పనిచేశారు. ASLV, PSLV రాకెట్ ప్రయోగాల్లో భాగస్వామ్యం అయ్యారు.

News July 6, 2025

సీజేఐ భవనాన్ని వెంటనే ఖాళీ చేయించండి: SC అడ్మినిస్ట్రేషన్

image

సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్‌లోని చీఫ్ జస్టిస్ బంగ్లాను వెంటనే ఖాళీ చేయించాలని కేంద్రాన్ని సూచించింది. ప్రస్తుతం అందులో మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ నివాసం ఉంటున్నారు. CJIగా చంద్రచూడ్ 2022 NOV నుంచి 2024 NOV వరకు పనిచేశారు. నిబంధన ప్రకారం రిటైర్మెంట్ తర్వాత 6నెలల వరకే(మే 31) ఆయనకు బంగ్లాలో ఉండటానికి అనుమతి ఉందని గుర్తు చేసింది.

News July 6, 2025

HYD: త్వరలో వాట్సప్ బస్ టికెట్

image

గ్రేటర్ HYDలో త్వరలో వాట్సప్ టికెటింగ్, డిజిటల్ బస్ పాస్ అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇప్పటికే క్యూఆర్ కోడ్ RTC బస్ టికెట్ విధానం అందుబాటులో ఉంది. జస్ట్ QR కోడ్ స్కాన్ చేసి, ఫోన్లో పేమెంట్ చేస్తే టికెట్ వస్తుంది. ఇవన్నీ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంలో ఒక భాగం. ఈ సేవలను మరింత విస్తరిస్తామని తెలిపారు.