News February 19, 2025

గోదావరిఖని: ‘భవిష్యత్ ఆ అరుదైన ఖనిజాలదే..!’

image

భవిష్యత్ ఆ అరుదైన ఖనిజాలదే అని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు. భారతదేశాన్ని 2047 నాటికి అగ్ర స్థాయిలో తీర్చిదిద్దేందుకు రూపొందించుకున్న వికసిత్ లక్ష్యాలను చేరుకోవడంలో మైనింగ్ రంగం పాత్ర అత్యంత కీలకమని, ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో గణనీయమైన పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు.

Similar News

News December 26, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాస్త తగ్గిన చలి

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చలి తీవ్రత కాస్త తగ్గింది. జగిత్యాల జిల్లా భీమారం మండలంలోని మన్నెగూడెంలో 10.8℃, మల్లాపూర్ మండలంలోని రాఘవపేటలో 10.8℃, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిజామాబాద్‌లో 10.9℃, పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని ఆకెనపల్లిలో 11.1℃, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్‌ నగర్‌లో 11.2℃ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News December 26, 2025

మానసిక ధైర్యాన్ని అందించే మహాకాళి అమ్మవారు

image

దశమహావిద్యలలో మొదటి రూపమైన శ్రీ మహాకాళీ దేవి శక్తికి, పరివర్తనకు ప్రతిరూపం. కృష్ణ వర్ణంతో ప్రకాశించే ఈమెను ఆరాధిస్తే సకల వ్యాధులు, గ్రహ దోషాలు, శత్రుపీడలు తొలగిపోతాయని నమ్మకం. తంత్రోక్త మార్గంలో ఈ మహావిద్యను ఉపాసించే వారికి మానసిక ధైర్యం, సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయువు సిద్ధిస్తాయి. అమ్మవారి అనుగ్రహంతో జీవితంలో విజయం లభిస్తుంది. సాధకులకు రక్షణ కవచంలా నిలిచి, మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తుంది.

News December 26, 2025

కామారెడ్డి చలి ప్రభావం.. స్థిరంగా ఉష్ణోగ్రతలు

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. రామలక్ష్మణపల్లి 9.6°C, గాంధారి 9.9, జుక్కల్ 10.2, మేనూర్ 10.3, మాక్దూంపూర్ 10.4, సర్వాపూర్ 10.7, లచ్చపేట, పెద్దకొడప్గల్ 10.8, నాగిరెడ్డిపేట, మాచాపూర్ 11, బీర్కూర్, బిచ్కుంద, ఎల్పుగొండ, డోంగ్లి 11.1, రామారెడ్డి, నస్రుల్లాబాద్ 11.2, బొమ్మన్ దేవిపల్లి 11.3, పిట్లం, భిక్నూర్, ఇసాయిపేట, పుల్కల్ 11.4°C.