News February 19, 2025

వికారాబాద్: అభివృద్ధి లక్ష్యంగా పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్

image

నాబార్డ్ ద్వారా పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ ద్వారా జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌‌‌లో 2025-26 నాబార్డ్ పొటెన్షియల్ లింక్ క్రెడిట్ ప్లాన్‌ను ఆవిష్కరించారు. ప్రాధాన్యతా విభాగంలో అందుబాటులో ఉన్న భౌతిక ఆర్థిక సామర్థ్యాన్ని అంచనా వేసి అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

Similar News

News January 15, 2026

శ్రీకాకుళం: బస్సుల్లో టికెట్ల ధర అధికంగా వసూలు చేస్తున్నారా?

image

శ్రీకాకుళం జిల్లాకు వస్తున్న ప్రైవేట్ బస్సులు, ఇతర ప్రాంతాలకు వెళుతున్న బస్సులను విస్తృతంగా తనిఖీ చేస్తున్నట్లు జిల్లా ఉప రవాణా శాఖ అధికారి విజయ సారథి చెప్పారు. ఆర్టీజీఎస్ యాప్ సహకారంతో పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ఈ నెల 18వ తేదీ వరకు తనిఖీలు సాగుతాయని వెల్లడించారు. అధిక ఛార్జీల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అలా చేస్తే హెల్ప్ లైన్ నంబర్ 9281607001 కు సంప్రదించాలన్నారు.

News January 15, 2026

యోగాసన పోటీల్లో మెదక్ క్రీడాకారుల ప్రతిభ

image

అస్మిత సౌత్ జోన్ యోగాసన ఛాంపియన్‌షిప్‌లో మెదక్ జిల్లా చేగుంటకు చెందిన క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్ నాచారం డీపీఎస్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో దక్షిణ భారత రాష్ట్రాల నుంచి 350 మందికి పైగా పాల్గొన్నారు. రిత్మిక్ పెయిర్ విభాగంలో సైనీ శిరీష, చిక్కుల మనోజ నాలుగో స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత పొందారు. వారు త్వరలో ఢిల్లీలో జరిగే జాతీయ అస్మిత యోగాసన పోటీల్లో పాల్గొననున్నారు.

News January 15, 2026

ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు… అప్లై చేశారా?

image

<>ఇర్కాన్ <<>>ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ 32 కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.. బీటెక్, బీఈ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 19 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు . నెలకు జీతం రూ.60 వేలు చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ircon.org