News February 19, 2025
కరీంనగర్: ప్రభుత్వ ఎస్సీ హాస్టల్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

కరీంనగర్ పట్టణం కాశ్మీర్ గడ్డలోని ప్రభుత్వ ఎస్సీ కళాశాల, గర్ల్స్ హాస్టల్‌ను మంగళవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లో వసతిపై ఆరా తీశారు. విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమయ్యే కెరియర్ ఆప్షన్స్ చాట్‌ను విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు. కాసేపు విద్యార్థులతో సరదాగా గడిపారు.
Similar News
News February 21, 2025
కరీంనగర్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం వెబ్‌సైట్!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెబ్ సైట్ తీసుకువచ్చింది. కరీంనగర్ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు ఇల్లు కోసం దరఖాస్తు చేసుకోగా.. లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. ప్రస్తుతం దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలియక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే వారంతా https:indirammaindlu.telangana.gov.inలో ఆధార్, ఫోన్ నంబర్ ద్వారా దరఖాస్తు వివరాలు తెలుసుకోవచ్చు. Share It.
News February 21, 2025
KNR: జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత

వేసవి నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గురువారం జిల్లాలో సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 33.0℃ గా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు చలి తీవ్రత కూడా తగ్గడంతో 19.0℃ సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఇప్పటికే జిల్లా ప్రజలు ఉక్కుపోతతో ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది.
News February 21, 2025
KNR: బండి సంజయ్‌పై ఉన్న కేసు కొట్టేసిన కోర్టు!

మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా కొంతమంది బీఆర్ఎస్ నాయకులను కేంద్రమంత్రి బండి సంజయ్ దండుపాళ్యం ముఠాతో పోల్చారంటూ 2023లో నల్గొండ జిల్లా మర్రిగూడ పోలీస్‌స్టేషన్లో కేసు నమోదయింది. ఈ కేసుపై గురువారం నాంపల్లి ప్రజాప్రతినిధుల న్యాయస్థానం తుది విచారణ జరిపి బండి సంజయ్‌ని నిర్దోషిగా ప్రకటించి, కేసు కొట్టి వేసింది.