News March 21, 2024
నేను అందరికీ అందుబాటులో ఉంటా: ప్రశాంతి

తాము ఎవరికీ అందుబాటులో ఉండమన్న అపోహ నాయకులు, కార్యకర్తల్లో ఉందని.. అలాంటి టెన్షన్ పెట్టుకోవద్దని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచించారు. తాను ప్రతి నాయకుడు, కార్యకర్తకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. నార్త్ రాజుపాలెంలో వేమిరెడ్డి దంపతుల పరిచయ కార్యక్రమం పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, దినేశ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. పోలంరెడ్డి కుటుంబం తరహాలోనే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ప్రశాంతి చెప్పారు.
Similar News
News January 13, 2026
నెల్లూరు జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: కలెక్టర్, SP

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ డా అజిత వేజెండ్ల హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. జిల్లా అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేయాలని సూచించారు.
News January 13, 2026
నెల్లూరు: పోలీసుల సంక్రాంతి సందడి ఇలా..!

నెల్లూరు జిల్లా చెముడుగుంటలోని డీటీసీలో సంక్రాతి వేడుకలు నిర్వహించారు. ట్రైనీ కానిస్టేబుళ్లతో కలిసి ఎస్పీ అజిత వేజెండ్ల భోగి మంటలు వెలిగించి సంబరాలను ప్రారంభించారు. నిత్యం శిక్షణలతో కనిపించే డీటీసీ మైదానం పల్లెటూరి వాతావరణాన్ని తలపించింది. ఆ తరహాలో ప్రత్యేకంగా అలంకరించారు. అరిసెలు, ఉప్పు చెక్కలు వంటి పిండి వంటకాలు చేసి పంచి పెట్టారు.
News January 13, 2026
నెల్లూరు వాసికి కీలక పోస్టింగ్

నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇందుపూరుకు చెందిన ఏటూరు భాను ప్రకాష్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్‌గా నియమితులయ్యారు. రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిగా 2004 నుంచి అక్కడ పనిచేస్తున్నారు. డిప్యుటేషన్‌పై మన రాష్ట్రంలోనూ కొంతకాలం విధులు నిర్వర్తించారు. కేంద్ర ఎన్నికల సంఘంలో నెల్లూరు జిల్లా వాసి పదవి పొందడం ఇదే తొలిసారి కావడం విశేషం.


