News February 19, 2025
ఫైనల్లో 100 ఓవర్లు వేసిన ఇండియా.. కానీ(2/2)

దీంతో మరోసారి శ్రీలంక మొదట బ్యాటింగ్ చేయగా 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 222 పరుగులే చేసింది. ఛేదనలో భారత జట్టు 8.4 ఓవర్లలో 38/1 పరుగులు చేయగా వర్షం కారణంగా ఆట సాధ్యపడలేదు. దీంతో ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. రెండు రోజులు కలిపి భారత బౌలర్లు 100 ఓవర్లు వేశారు. ఈ టోర్నీలో సెహ్వాగ్(271) అత్యధిక పరుగులు చేయడం గమనార్హం. ఆ తర్వాత 11 ఏళ్లకు ధోనీ సారథ్యంలోని భారత జట్టు ట్రోఫీని నెగ్గింది.
Similar News
News November 8, 2025
సీఎం రేవంత్ రెడ్డికి మోదీ, చంద్రబాబు విషెస్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు <<18231362>>పుట్టినరోజు<<>> శుభాకాంక్షలు తెలిపారు. ఆయన దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు. రేవంత్ రెడ్డి ఆరోగ్యంగా ఉంటూ తెలంగాణ ప్రజలకు ఇలాగే సేవ చేయాలని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. అటు డిప్యూటీ సీఎం భట్టి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి విషెస్ చెప్పారు.
News November 8, 2025
‘శుక్ల పక్షం’ అంటే ఏంటి?

ప్రతి నెలా అమావాస్య తర్వాత, పౌర్ణమి వరకు ఉండే 15 రోజుల కాలాన్ని శుక్ల పక్షంగా వ్యవహరిస్తారు. ఈ పక్షంలో చంద్రుని కళలు క్రమంగా పెరుగుతుంటాయి. రోజురోజుకూ వెన్నెల పెరుగుతుంది. చంద్రుడు ప్రకాశవంతమయ్యే స్థితిలోకి వెళ్లడం వల్ల దీనిని వృద్ధి చంద్ర పక్షం/ తెలుపు పక్షం అని కూడా అంటారు. శుక్ల అంటే తెలుపును సూచిస్తుంది. దాని ఆధారంగా శుక్ల పక్షం అనే పేరు వచ్చింది. దీన్నే శుద్ధ పక్షం అని కూడా పిలుస్తారు.
News November 8, 2025
CWCలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్(CWC)లో 22 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎగ్జామ్‌కు 21 రోజుల ముందు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://cwceportal.com/


