News March 21, 2024
DCCB ఛైర్మన్ పదవీకి పోచారం భాస్కర్ రెడ్డి రాజీనామా!

నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. లేఖను సహకారశాఖ కమిషనర్‌కు పంపుతున్నట్లు ప్రకటించారు. కాగా తనపై డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడాన్ని సవాల్ చేస్తూ భాస్కర్ రెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే ఇవ్వలేదు. రాజీనామా లేఖ తమకు అందలేదని జిల్లా సహకార అధికారి శ్రీనివాస్‌రావు వెల్లడించారు. కాగా రేపు అవిశ్వాసం పై ఓటింగ్ జరగనుంది.
Similar News
News October 31, 2025
NZB: కల్వల మత్తడి మరమ్మతులు వెంటనే చేపట్టాలి: కవిత

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కల్వల మత్తడి మరమ్మతులను వెంటనే చేపట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. కల్వల ప్రాజెక్టును ఆమె శుక్రవారం సందర్శించారు. మత్తడి కొట్టుకుపోయి 3 ఏళ్లు అవుతోందన్నారు. మరమ్మతులకు గత ప్రభుత్వమే రూ.70 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు బాగు చేయించలేదన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 6 వేల ఎకరాలకు సాగు నీరందుతుందన్నారు.
News October 31, 2025
తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: కవిత

తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆమె సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొలకెత్తిన,బూజు పట్టిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలన్నారు.
News October 31, 2025
ఎకరానికి రూ.50 వేల పరిహారం ఇవ్వాలి: కవిత

భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి, రైతన్నల ఆరుగాలం కష్టం నీటిపాలైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వాలని ఆమె కోరారు. ఎకరాకు రూ.10 వేల సాయం సరిపోదని, ఒక్కో ఎకరానికి రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని కవిత ట్వీట్ చేశారు.


