News February 19, 2025

సంగారెడ్డి: విద్యార్థిని అభినందించిన డీఈవో

image

జిల్లా కేంద్రంలోని జిల్లా సైన్స్ మ్యూజియంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి భౌతికశాస్త్రం ప్రతిభ పరీక్ష పోటీలో న్యాల్కల్ మండలంలోని మిర్జాపూర్ పాఠశాలకు చెందిన సాదియ నౌశిన్ అనే విద్యార్థిని రాష్ట్ర స్థాయిలో 5వ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, డీసీఈబి సెక్రటరీ లింబాజి, సైన్స్ అధికారి సిద్ధారెడ్డిలు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News January 7, 2026

CSLలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

image

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(CSL)లో 210 వర్క్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. అభ్యర్థులు టెన్త్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసై ఉండాలి. కేటగిరీల వారీగా గరిష్ఠ వయో పరిమితి 45 ఏళ్ల వరకు ఉంది. ఈ నెల 23వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక్కడ <>క్లిక్<<>> చేసి నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోండి.

News January 7, 2026

టెన్త్ ఎగ్జామ్ ఫీజు చెల్లించేందుకు లాస్ట్ ఛాన్స్

image

TG: టెన్త్ ఎగ్జామ్స్ ఫీజు చెల్లించేందుకు విద్యాశాఖ చివరి అవకాశం కల్పించింది. తత్కాల్ విధానంలో ₹వెయ్యి లేట్ ఫీజుతో ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పింది. ఆయా తేదీల్లో స్కూల్ HMలకు ఫీజులు చెల్లించాలని పేర్కొంది. హెడ్మాస్టర్లు 28వ తేదీ లోపు చలానా రూపంలో కట్టాలని, 29వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలంది. ఇదే చివరి అవకాశం అని, మరోసారి గడువు పొడిగించబోమని వివరించింది.

News January 7, 2026

నేడు ఖమ్మానికి కేటీఆర్.. మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఖమ్మంలో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం, నాయకులను సమాయత్తం చేయడం లక్ష్యంగా ఈ పర్యటన జరుగుతోంది. ఉదయం 10:30కు ఖమ్మం చేరుకుని రాపర్తినగర్ నుంచి బీఆర్ఎస్ కార్యాలయం వరకు కార్యకర్తలు, నాయకుల ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం సర్పంచ్‌లకు సన్మానం, కార్యకర్తల సమావేశంలో ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.