News February 19, 2025
కుంభమేళాలో కిషన్ రెడ్డి కుటుంబం

TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా కుంభమేళాలో పాల్గొన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో పవిత్రస్నానం ఆచరించారు. మంగళవారం సాయంత్రం భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి ఆయన త్రివేణీ సంగమానికి చేరుకున్నారు. సనాతన ధర్మంపై రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణకు కుంభమేళాకు తరలివస్తున్న భక్తజనమే నిదర్శనమని ఆయన ఈ సందర్భంగా అన్నారు. త్రివేణీ సంగమంలో స్నానం చేయడం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు.
Similar News
News February 22, 2025
ఒక్క గంట నడిస్తే 6 గంటల ఆయుష్షు పెరుగుద్ది!

నడక ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్తున్నా కొందరు అడుగు తీసి అడుగేయరు. తాజా అధ్యయనంలో రోజులో ఒక గంట నడిస్తే 6 గంటల ఆయుష్షు పెరుగుతుందని తేలింది. సాధారణ వ్యక్తులు తమ పనికి మరో గంట నడకను జోడిస్తే 6.3 గంటల ఆయుష్షును పెంచుకున్నట్లేనని వెల్లడైంది. నడక కండరాల బలాన్ని & ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని వైద్యులు చెబుతున్నారు. అధిక బరువు, డయాబెటిస్, గుండెపోటు తగ్గించేందుకు నడక అవసరమంటున్నారు. SHARE IT
News February 21, 2025
కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు

తెలంగాణలో డీజీగా ఉన్న అంజనీకుమార్‌ను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలిచ్చింది. అంజనీ కుమార్ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ఆయనతో పాటు TG పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. ఏపీ క్యాడర్లో రిపోర్టు చేయాలని ఈ ముగ్గురికి ఆదేశాలు జారీ చేసింది.
News February 21, 2025
అఫ్గాన్‌పై సౌతాఫ్రికా భారీ విజయం

CT-2025: అఫ్గానిస్థాన్‌పై సౌతాఫ్రికా 107 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 315 రన్స్ చేసింది. 316 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ బ్యాటింగ్ నెమ్మదిగా సాగింది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. రహ్మత్ షా(90) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. SA బౌలర్లలో రబాడ 3, ఎంగిడి, మల్డర్ తలో 2 వికెట్లు తీశారు.