News February 19, 2025

గండికోటలో సెల్ఫీ తీసుకున్న అజయ్ జైన్, కలెక్టర్, MLA

image

గండికోటను ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఇక్కడ వనరులు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. ఇక్కడి ప్రకృతి ఆస్వాదించారు. అనంతరం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో గండికోట లోయ అందాల వద్ద సెల్ఫీ దిగారు.

Similar News

News February 21, 2025

భాష ఆగితే జాతి మరణిస్తుంది: తులసి రెడ్డి

image

శ్వాస ఆగితే మనిషి, భాష ఆగితే జాతి మరణిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డా.తులసి రెడ్డి అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవాన్ని వేంపల్లిలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. వేంపల్లి తల్లిశెట్టి సుబ్రహ్మణ్యం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన తెలుగు పండితులు ధర్మా రెడ్డి ,కృష్ణవేణి, పద్మజ తదితరులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

News February 21, 2025

కడప: జిల్లా వ్యాప్తంగా పోలీసుల పల్లెనిద్ర..

image

కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గ్రామాలకు వెళ్లి గస్తీ నిర్వహించి ప్రజలతో సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూడాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News February 21, 2025

జగన్‌కు చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఇప్పిస్తా: బీటెక్ రవి

image

పులివెందుల సమస్యల పరిష్కారం కోసం జగన్ సీఎం వద్దకు వస్తానంటే చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఇప్పిస్తానని బీటెక్ రవి అన్నారు. వెంపల్లెలో గురువారం ఆయన మాట్లాడుతూ.. జగన్‌కు పులివెందుల ప్రజలు అంటే ప్రేమ లేదని విమర్శించారు. నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నా జగన్ పట్టించుకోవడం లేదన్నారు. పులివెందులకి ఉప ఎన్నికలు వస్తాయని రవి మరో సారి ధీమా వ్యక్తం చేశారు.

error: Content is protected !!