News February 19, 2025
భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య..

భార్య కాపురానికి రావడంలేదని మనస్థాపానికి గురై భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మద్నూర్ మండలంలో జరిగింది. SI విజయ్ కొండ వివరాలిలా..హండే కల్లూర్ వాసి సురేష్ (35) తో భార్య దేవ్ బాయ్ 5 ఏండ్ల క్రితం గొడవపడి పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి సురేష్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 16న ఇంటి నుంచి వెళ్లి పోయాడు. ఆచూకీ కోసం వెతకగా సలాబత్ పూర్ బోడ బావి దగ్గర శవమై కనిపించాడు. పిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Similar News
News September 18, 2025
ఆహా! ఎంత అద్భుతమైన శ్లోకం (1/2)

‘తం భూసుతా ముక్తిముదార హాసం
వందే యతో భవ్యభవం దయాశ్రీ:
శ్రీ యాదవం భవ్య భతోయ దేవం
సంహారదా ముక్తి ముతా సుభూతం’
పండిత దైవజ్ఞ సూర్య సూరి రచించిన శ్రీ రామకృష్ణ విలోమ కావ్యంలోని శ్లోకమిది. ముందు నుంచి చదివినా, వెనుక నుంచి చదివినా ఈ శ్లోకం ఒకేలాగా(వికటకవి లాగ) ఉంటుంది. ఎడమవైపు నుంచి చదివితే శ్రీరాముణ్ని, కుడివైపు నుంచి చదివితే శ్రీకృష్ణుణ్ని స్తుతించేలా ఉన్న ఈ శ్లోకం అద్భుతం కదా!
News September 18, 2025
ఆహా! ఎంత అద్భుతమైన శ్లోకం (2/2)

ఈ శ్లోకాన్ని ఎడమ నుంచి చదివితే ‘ఎవరైతే సీతను కాపాడారో, ఎవరి చిరునవ్వు అందంగా ఉంటుందో, ఏ అవతారం విశేషమైనదో, ఎవరినుంచైతే దయ, అద్భుతమూ ప్రతిచోట వర్షిస్తుందో అట్టి రాముడికి నమస్కరిస్తున్నాను’ అని అర్థం వస్తుంది. కుడి వైపు నుంచి చదివితే ‘యాదవ కులంలో పుట్టిన, సూర్యచంద్రులకు ప్రాణాధారమైన, పూతనను సంహరించిన, సకల సృష్టికి ఆత్మయైన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తున్నాను’ అనే అర్థం వస్తుంది. అద్భుతమైన శ్లోకం కదా!
News September 18, 2025
నెల్లూరు: రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆగేదెప్పుడు?

నెల్లూరులో రేషన్ బియ్యం మాఫియా ఆగడం లేదు. ప్రభుత్వ హెచ్చరికలు, కేసులు ఉన్నా అక్రమార్కులు కోట్ల విలువైన బియ్యం నల్లబజారుకు మళ్లిస్తున్నారు. నెల్లూరు, ఆత్మకూరు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు మిల్లుల్లోనే బియ్యం రీసైకిల్ చేసి సీఎంఆర్ కింద ప్రభుత్వానికే తిరిగి పంపుతున్నారు. జిల్లాలో నెలకు సరఫరా చేసే 11 వేల టన్నుల్లో సుమారు 8 వేల టన్నులు పక్కదారి పడుతున్నాయని సమాచారం.