News February 19, 2025

MDCL: జిల్లాలో 437.26 మెట్రిక్ టన్నుల యూరియా

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత ఉందనేది అవాస్తవమని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్రకళ తెలిపారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా పంటలు సాగులో ఉన్న 8 మండలాల్లో 437.26 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉన్నట్లుగా తెలిపారు. వ్యాపారులు, డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి, రైతులను ఇబ్బందులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News February 21, 2025

కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు

image

తెలంగాణలో డీజీగా ఉన్న అంజనీకుమార్‌ను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలిచ్చింది. అంజనీ కుమార్ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ఆయనతో పాటు TG పోలీస్ అకాడమీ డైరెక్ట‌ర్‌ అభిలాష బిస్త్, కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. ఏపీ క్యాడర్‌లో రిపోర్టు చేయాలని ఈ ముగ్గురికి ఆదేశాలు జారీ చేసింది.

News February 21, 2025

కుంభాభిషేక కార్యక్రమానికి కేసీఆర్‌కు ఆహ్వానం

image

యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేక కార్యక్రమానికి రావాల్సిందిగా ఆలయ పూజారులు శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 23న మహా కుంభాభిషేక కార్యక్రమం జరుగుతుందని కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.

News February 21, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి: అడిషనల్ కలెక్టర్
> జిల్లా వ్యాప్తంగా ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు
> ఓవర్ లోడుతో వెళ్తున్న వాహనాన్ని సీజ్ చేసిన రవాణా అధికారులు
> ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలపై జిల్లా కలెక్టరేట్లో సమావేశం
> తేనెటీగల దాడిలో గీత కార్మికుడికి తీవ్ర గాయాలు
> పాలకుర్తి శ్రీ సోమేశ్వర ఆలయ ప్రసాద కేంద్రాన్ని తనిఖీ చేసిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్

error: Content is protected !!