News February 19, 2025
కులంలోనే కాదు.. మతంలోనూ పేదరికం ఉంది: షబ్బీర్ అలీ

TG: మైనారిటీలను BCల్లో కలిపారంటూ BJP చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. ‘వెనుకబడిన మైనార్టీలు ఇప్పటికీ BC జాబితాలో ఉన్నారు. కులంలోనే కాదు మతంలోనూ పేదరికం ఉంది. పిలిస్తే బీజేపీ ఆఫీస్‌కు వచ్చి ప్రజెంటేషన్ ఇస్తా. వెనుకబడిన తరగతులు ఎక్కడ ఉన్నా వెనుకబడిన తరగతులే. బీసీలపై BJPకి అంత ప్రేమ ఉంటే బీసీ కులగణన చేయించాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News February 21, 2025
కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు

తెలంగాణలో డీజీగా ఉన్న అంజనీకుమార్‌ను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలిచ్చింది. అంజనీ కుమార్ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ఆయనతో పాటు TG పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. ఏపీ క్యాడర్‌లో రిపోర్టు చేయాలని ఈ ముగ్గురికి ఆదేశాలు జారీ చేసింది.
News February 21, 2025
అఫ్గాన్‌పై సౌతాఫ్రికా భారీ విజయం

CT-2025: అఫ్గానిస్థాన్‌పై సౌతాఫ్రికా 107 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 315 రన్స్ చేసింది. 316 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ బ్యాటింగ్ నెమ్మదిగా సాగింది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. రహ్మత్ షా(90) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. SA బౌలర్లలో రబాడ 3, ఎంగిడి, మల్డర్ తలో 2 వికెట్లు తీశారు.
News February 21, 2025
గ్రూప్-2 అభ్యర్థుల సమస్యలు పరిష్కరిస్తా: లోకేశ్

AP: రాష్ట్రంలోని గ్రూప్-2 అభ్యర్థుల సమస్యలు పరిష్కరించేందుకు తాను కృషి చేస్తున్నానని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయని ట్వీట్ చేశారు. వారి బాధ, ఆందోళనను అర్థం చేసుకుని లీగల్ టీమ్‌తో చర్చిస్తున్నట్లు తెలిపారు. దీనికి ఏదో ఒక పరిష్కారం చూపెడతామని పేర్కొన్నారు. రోస్టర్ విధానంలో తప్పులు సరిచేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.