News February 19, 2025

నేడు బీఆర్ఎస్ భవన్‌కు కేసీఆర్

image

TG: గులాబీ బాస్ కేసీఆర్ నెలల విరామం తరువాత బీఆర్ఎస్ భవన్‌కు రానున్నారు. ఇవాళ మ.2 గంటలకు జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొంటారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ నేతలు, ఇతర నాయకులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 ఏళ్లు కావొస్తున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News February 21, 2025

కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు

image

తెలంగాణలో డీజీగా ఉన్న అంజనీకుమార్‌ను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలిచ్చింది. అంజనీ కుమార్ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ఆయనతో పాటు TG పోలీస్ అకాడమీ డైరెక్ట‌ర్‌ అభిలాష బిస్త్, కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. ఏపీ క్యాడర్‌లో రిపోర్టు చేయాలని ఈ ముగ్గురికి ఆదేశాలు జారీ చేసింది.

News February 21, 2025

అఫ్గాన్‌పై సౌతాఫ్రికా భారీ విజయం

image

CT-2025: అఫ్గానిస్థాన్‌పై సౌతాఫ్రికా 107 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 315 రన్స్ చేసింది. 316 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ బ్యాటింగ్ నెమ్మదిగా సాగింది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. రహ్మత్ షా(90) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. SA బౌలర్లలో రబాడ 3, ఎంగిడి, మల్డర్ తలో 2 వికెట్లు తీశారు.

News February 21, 2025

గ్రూప్-2 అభ్యర్థుల సమస్యలు పరిష్కరిస్తా: లోకేశ్

image

AP: రాష్ట్రంలోని గ్రూప్-2 అభ్యర్థుల సమస్యలు పరిష్కరించేందుకు తాను కృషి చేస్తున్నానని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయని ట్వీట్ చేశారు. వారి బాధ, ఆందోళనను అర్థం చేసుకుని లీగల్ టీమ్‌తో చర్చిస్తున్నట్లు తెలిపారు. దీనికి ఏదో ఒక పరిష్కారం చూపెడతామని పేర్కొన్నారు. రోస్టర్ విధానంలో తప్పులు సరిచేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

error: Content is protected !!