News February 19, 2025

కళ్యాణదుర్గం కానిస్టేబుల్‌కు జిల్లా ఎస్పీ అభినందన

image

ఆంధ్రప్రదేశ్ మాస్టర్ అథ్లెటిక్స్ రాష్ట్ర స్థాయి పోటీల్లో నాలుగు పతకాలు సాధించిన కళ్యాణదుర్గం కానిస్టేబుల్ షఫీని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ అభినందించారు. పతకాలను ప్రదానం చేయడంతో పాటు కానిస్టేబుల్‌ను సన్మానించారు. కాగా షఫీ 100 మీటర్స్ ఈవెంట్‌లో 3వ స్థానం, 200, 400 మీటర్స్‌లో ప్రథమ స్థానం, 4×100 రిలేలో 2వ స్థానం సాధించారు. మార్చి 4 నుంచి 9 వరకు బెంగుళూరులో జరిగే జాతీయ పోటీలకు అర్హత సాధించారు.

Similar News

News February 22, 2025

అనంతపురం జిల్లా నేటి ముఖ్యాంశాలు ఇవే

image

☞ గుత్తి వద్ద టూరిస్ట్ బస్సు బోల్తా.. 20 మంది గాయాలు☞అనంతపురం పెట్రోల్ బంక్ లో మోసం..రూ.2.9 కోట్ల మేర మోసం ☞ తాడిపత్రిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ద్వజారోహణం కార్యక్రమం ☞ టమోటా రైతులు అధైర్యపడవద్దు-ఎమ్మెల్యే పరిటాల సునీత ☞అనంతపురంలో గ్రూప్ 2 వాయిదా నిరసన ☞ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ లక్ష్మీనారాయణ

News February 21, 2025

అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించాలని వినతి

image

అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులును అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నాయకులు కోరారు. ఎమ్మెల్యే నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. అగ్రి గోల్డ్ ఏజెంట్లు పడుతున్న బాధలు విన్నవించారు. కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నాగార్జున, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కోట్రెష్, అగ్రిగోల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా సహాయ కార్యదర్శి ఎర్రిస్వామి పాల్గొన్నారు.

News February 21, 2025

అనంతపురం వైసీపీ నేతకు అంతర్జాతీయ అవార్డు

image

అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ నేత చిట్లూరి రమేశ్ గౌడ్ అంతర్జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. దుబాయ్‌లో వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ సంస్థ నుంచి అవార్డును అందుకున్నారు. సామాజిక, రాజకీయ, వ్యక్తిగత కేటగిరిలో అవార్డు దక్కినట్లు ఆయన తెలిపారు. చిట్లూరి రమేశ్ ఇటీవలే వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన విషయం తెలిసిందే. ఆయనకు పలువురు వైసీపీ నేతలు అభినందనలు చెప్పారు.

error: Content is protected !!