News February 19, 2025
MBNR: మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత శిక్షణ

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహిళలకు “SBI, SBRSETI” ఆధ్వర్యంలో ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ G.శ్రీనివాస్ తెలిపారు. Way2Newsతో ఆయన మాట్లాడుతూ.. ఎంబ్రాయిడరీ డిజైన్ లలో ఈనెల 24 నుంచి 30 రోజుల పాటు ఉచిత శిక్షణ, భోజనం, వసతి ఉంటుందన్నారు. SSC MEMO, ఆధార్, రేషన్ కార్డులతో దరఖాస్తులు చేసుకోవాలని, 19-45 సం.లలోపు ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు 95424 30607కు సంప్రదించాలన్నారు.
Similar News
News September 18, 2025
సంగారెడ్డి: 20న ఉమ్మడి జిల్లా స్విమ్మింగ్ ఎంపికలు

స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా స్విమ్మింగ్ ఎంపికలు ఈనెల 20న సంగారెడ్డిలోని స్విమ్మింగ్ పూల్‌లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. బాలబాలికల అండర్- 14, 17 ఎంపికలు జరుగుతాయని చెప్పారు. పూర్తి వివరాల కోసం 9494991828 నెంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
News September 18, 2025
బీడీ కార్మికుల పిల్లలకు మరో అవకాశం..!

బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాల దరఖాస్తు గడువు సెప్టెంబర్ 30 వరకు పొడగించినట్లు జగిత్యాల బీడీ కార్మికుల దవాఖానా మెడికల్ ఆఫీసర్ డా.శ్రీకాంత్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పాఠశాల పేరు పోర్టల్లో కనిపించకపోతే సమస్యలను wclwohyd@nic.inకు పంపాలన్నారు. సందేహాలుంటే 9966621170కు కాల్ చేయవచ్చన్నారు.
News September 18, 2025
ఈ సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు అక్కడ జరిగే ఇన్వెస్టర్ల సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే కేంద్రమంత్రులతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది.