News February 19, 2025
అయినవిల్లి : పాము కాటుకు గురైన వ్యక్తి సేఫ్

అయినవిల్లి మండలం వీరవల్లిపాలేనికి చెందిన రామకృష్ణ మంగళవారం తాచుపాము కాటుకు గురయ్యాడు. అతణ్ని గ్రామ సర్పంచ్ బుచ్చిబాబు, పంచాయతీ సభ్యుడు నరసింహమూర్తి అయినవిల్లి PHCకి తరలించారు. డాక్టర్ మంగాదేవి సిబ్బందిని సమన్వయం చేస్తూ సకాలంలో వైద్యం అందించారు. దీంతో అతనికి ప్రమాదం తప్పి, ప్రాణాలు కాపాడుకున్నారు.
Similar News
News September 13, 2025
విజయవాడ నుంచి పలాసకు సూపర్ లగ్జరీ బస్సులు

ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ నుండి పలాసకు ప్రతి రోజూ సూపర్ లగ్జరీ బస్సులు నడుపుతున్నామని RTC ఒక ప్రకటనలో తెలిపింది. మధ్యాహ్నం 2.30, సాయంత్రం 6 గంటలకు విజయవాడలో బయలుదేరే ఈ బస్సులు మరుసటి రోజు ఉదయం 4, 7.30కు పలాస చేరుకుంటాయని, తిరుగు ప్రయాణంలో సాయంత్రం 5.20, 6,15కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6, 7 గంటలకు విజయవాడ చేరుకుంటాయని, ప్రయాణికులు ఈ సర్వీసులను ఆదరించాలని RTC వర్గాలు విజ్ఞప్తి చేశాయి.
News September 13, 2025
VJA: ఫుడ్ పాయిజనే కారణమా?

బయట వేయించిన చికెన్, చేపలు, ఇతర ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయి డయేరియా వ్యాప్తికి కారణమని కొందరు వైద్యాధికారులు చెబుతున్నారు. ఇవి బాధితులు చెప్పిన విషయాలు మాత్రమేనని, నిర్ధారణ కోసం పంపిన ఫుడ్ శాంపిల్స్ రిపోర్టులు ఇంకా రాలేదని సమాచారం. డయేరియా అదుపులోనే ఉందని ప్రజలను మభ్యపెడుతున్నారనే ఆరోపిణలూ వినిపిస్తున్నాయి. కేసులు పెరుగుతున్నా అధికారులు సీరియస్‌గా తీసుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.
News September 13, 2025
పార్వతీపురం మన్యం జిల్లాకు చేరుకున్న కొత్త కలెక్టర్

ఇటీవల బదిలీపై పార్వతీపురం మన్యం జిల్లాకు కలెక్టర్‌గా నియమించబడ్డ ప్రభాకర్ రావు కలెక్టరేట్‌కు శనివారం చేరుకున్నారు. ఆయనకు పలువురు అధికారులు పుష్ప గుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసేలా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జిల్లాలో సమస్యలు గుర్తించి వాటి పరిష్కార దిశగా అడుగులు వేస్తామన్నారు.