News March 21, 2024

ఖమ్మం పార్లమెంట్ బరిలో TDP?

image

TG: ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి TDP పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. TDP, BJP పొత్తులో భాగంగా ఈ సీటును ఆ పార్టీకి కేటాయించినట్లు సమాచారం. ఇక్కడి నుంచి కమ్మ సామాజికవర్గ అభ్యర్థిని బరిలోకి దించుతున్నట్లు టాక్. మొత్తం 17 స్థానాలకు గానూ 15 స్థానాలకు BJP అభ్యర్థులను ఖరారు చేసింది. వరంగల్, ఖమ్మం సెగ్మెంట్లను పెండింగ్‌లో ఉంచింది. వరంగల్ నుంచి ఆరూరి రమేశ్, ఖమ్మం నుంచి TDP పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది.

Similar News

News November 25, 2024

‘ప్రీమియర్స్’ సేల్స్‌లో పుష్ప-2 సంచలనం

image

అల్లు అర్జున్-రష్మిక జంటగా నటించిన పుష్ప-2 మూవీ విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. డిసెంబర్ 4న అమెరికా ప్రీమియర్స్‌ కోసం అత్యంత వేగంగా 50,000 టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా రికార్డు సాధించింది. ‘పుష్ప కేవలం చరిత్ర సృష్టించట్లేదు. ప్రతి చోటా తన రూల్‌ను ముద్రిస్తున్నాడు’ అని మేకర్స్ రాసుకొచ్చారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది.

News November 25, 2024

పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు గుడ్ న్యూస్

image

TG: పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఉపయోగపడే అంశాలపై ‘జనరల్ స్టడీస్ ఫర్ ఆల్’ పేరుతో టీ-సాట్ ప్రసారాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల పాఠ్యాంశాలపై ఇవాళ్టి నుంచి 5 నెలల పాటు 600 ఎపిసోడ్‌లు ప్రసారం చేయనున్నట్లు టీ-సాట్ సీఈవో వేణుగోపాల్ తెలిపారు. టీ-సాట్ నిపుణ ఛానల్‌లో మ.12-1 గంటల వరకు, మ.3-4 గంటల వరకు, విద్య ఛానల్‌లో రా.8-10 గంటల వరకు టెలికాస్ట్ ఉంటుందని పేర్కొన్నారు.

News November 25, 2024

భూకేటాయింపులు రద్దు చేస్తూ సుప్రీం తీర్పు

image

TG: జీహెచ్‌ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు భూకేటాయింపులు రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టుల సొసైటీలకు గతంలో ప్రభుత్వాలు భూకేటాయింపులు చేశాయి. వీటిని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు కాగా, సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. ప్రభుత్వానికి సొసైటీలు చెల్లించిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది.