News February 19, 2025

తిరుపతి: ఇంటికి వెళ్లి వస్తానని.. అనంతలోకాలకు

image

చిట్టమూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. DV సత్రం(M), కల్లూరుకి చెందిన మస్తాన్(42) అత్తారిల్లు మొలకలపూడి వెళ్లి తిరిగి స్వగ్రామానికి బైకుపై బయలుదేరాడు. చిల్లమూరు క్రాస్ రోడ్డు వద్ద మరో బైకు ఢీకొనగా..మస్తాన్ దుర్మరణం చెందాడు. ఇద్దరికి గాయాలయ్యాయి. మృతుడి కూతురు సార్య పదో తరగతి చదువుతోంది. అతడి బంధువులు బోరున విలపించడం చూపరులను కన్నీళ్లు తెప్పించింది.

Similar News

News September 13, 2025

జూబ్లీహిల్స్ అభివృద్ధిపై కాంగ్రెస్ ఫోకస్..!

image

జూబ్లీహిల్స్ అభివృద్ధిపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర మంత్రులు నిరంతరం ఆ నియోజకవర్గంలో పర్యటిస్తూ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఈరోజు ఎర్రగడ్డ డివిజన్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.2.94 కోట్లతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్, BJP, MIM నాయకులు ఉన్నారు.

News September 13, 2025

మందు బాబులకు భారీగా జరిమానాలు: VZM SP

image

మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై భారీగా జరిమానాలను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం తెలిపారు. మొత్తం 85 మందిని కోర్టులో ప్రవేశపెట్టగా ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున రూ.8.50 లక్షల జరిమానాను విధిస్తూ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తేజ చక్రవర్తి తీర్పు చెప్పారన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల బారిన పడడమే కాకుండా ఇతరులకు కూడా నష్టాన్ని కలిగిస్తున్నారన్నారు.

News September 13, 2025

తిరుపతి SPగా సుబ్బరాయుడు ఘనతలు ఇవే.!

image

తిరుపతి SPగా సుబ్బరాయడుకు రెండోసారి అవకాశం దక్కింది. మెదటి టర్మ్‌లో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యాత్రికుల క్షేమం కోసం నైట్ బీట్లను ముమ్మరం చేయడం, అప్పట్లో సంచలనంగా మారిన ఎర్రవారిపాళ్యం ఫొక్సో కేసులో 24 గంటల్లో నిందితుడిని అరెస్టు చేశారు. తిరుపతిలో మహిళా రక్షక్ టీములను ఏర్పాటు చేసిన ఘనత ఈయనదే. నగరంలో గంజాయిపై ఉక్కుపాదం మోపారు. అప్పట్లో 15 మంది పోలీసులపై సైతం ఆయన చర్యలు తీసుకున్నారు.