News February 19, 2025
శివాజీ జయంతి: హోరెత్తనున్న సంగారెడ్డి

మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ జయంతి నేడు. ఈ సందర్భంగా ఉత్సవాలకు సంగారెడ్డి జిల్లా ముస్తాబైంది. మహారాష్ట్ర సరిహద్దు జిల్లా కావడంతో జహీరాబాద్, నారాయణఖేడ్‌లో పెద్ద ఎత్తున ర్యాలీలకు ప్లాన్ చేశారు. శివాజీ మహారాజ్ భారీ విగ్రహాలను పట్టణాల్లో ఊరేగిస్తారు. జై భవాని.. జై శివాజీ నినాదాలతో నేడు సంగారెడ్డి హోరెత్తనుంది.
Similar News
News February 25, 2026
వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!

అమెరికా ఆంక్షలు ఎత్తేశాక వెనిజులా నుంచి ఇండియాకు ముడిచమురు దిగుమతులు మొదలయ్యాయి. ఏకంగా 20 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్‌ను మోసుకెళ్లే సూపర్ సైజ్ ట్యాంకర్లు భారత తీరం వైపు కదులుతున్నాయని రాయిటర్స్ సంస్థ తెలిపింది. ఈ వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్ల (VLCC) వల్ల రవాణా ఖర్చులు తగ్గడంతోపాటు వేగంగా డెలివరీలు జరుగుతాయని చెప్పింది. నిస్సోస్ కియా, నిస్సోస్ కైథ్నోస్, అర్జానా ట్యాంకర్లు రానున్నట్లు పేర్కొంది.
News February 25, 2026
మెదక్ జిల్లాకు టెన్త్ మూల్యాంకన కేంద్రం కేటాయింపు

మెదక్ జిల్లాకు ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకన కేంద్రాన్ని కేటాయిస్తూ రాష్ట్ర పరీక్షల విభాగం ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఈఓ ఏ. విజయ తెలిపారు. జిల్లాలోనే కేంద్రం ఏర్పాటు కావడం వల్ల స్థానిక ఉపాధ్యాయులకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని ఆమె పేర్కొన్నారు. కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్‌కు ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
News February 25, 2026
పెద్దపల్లి జిల్లాలో మావోయిస్టు పార్టీ ఖాళీ..!

పెద్దపల్లి జిల్లాలో మావోయిస్టు పార్టీ ఖాళీ అయింది. మంథనికి చెందిన మావోయిస్ట్ పార్టీ సీనియర్ నేత మల్లా రాజిరెడ్డి, శ్రీరాంపూర్(M) చెందిన కంకణాల రాజిరెడ్డి లొంగిపోవడంతో ఈ చర్చ నడుస్తోంది. కొన్ని రోజుల క్రితం కేంద్ర కమిటీ సభ్యుడు PDPL పట్టణానికి చెందిన మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్రలో లొంగిపోయారు. వేణుగోపాల్ సోదరుడు, కేంద్ర కమిటీ సభ్యుడు కోటేశ్వరరావు బెంగాల్ (2011)లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు.


