News February 19, 2025

VJA: రూ.45 కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల 

image

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇమామ్‌లు, మౌజమ్‌ల గౌరవ వేతనం నిమిత్తం రూ.45 కోట్ల పెండింగ్ బకాయిలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో విజయవాడ పశ్చిమ టీడీపీ నేత MS బేగ్ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ.. ముస్లిం మైనారిటీ సమాజానికి భరోసాని కల్పించే పార్టీ టీడీపీ మాత్రమే అనన్నారు. గత వైసీపీ పాలనలో ముస్లింలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన పేర్కొన్నారు.

Similar News

News September 18, 2025

ఎటపాక: స్కూ డ్రైవర్ బిట్‌ను మింగేసిన బాలుడు

image

ఎటపాకలోని చోడవరానికి చెందిన గౌతమ్ (8) బుధవారం ఆడుకుంటూ స్క్రూ డ్రైవర్‌ను మింగేశాడు. తీవ్రమైన కడుపునొప్పితో అల్లాడుతుండగా కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. అది పేగులో అడ్డం తిరగడంతో భద్రాచలం ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ చేసి బిట్‌ను బయటకు తీశారు. దీంతో బాలుడు సురక్షితంగా ప్రాణాలతో బయట పడ్డాడు.

News September 18, 2025

HYD: దుర్గామాత మండపాలకు అనుమతి తప్పనిసరి

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఏర్పాటు చేసే దుర్గామాత మండపాలకు నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నిర్వాహకులు మండపాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు. వెబ్‌సైట్ https://policeportal.tspolice.gov.in/index.htmలో నమోదు చేయాలన్నారు.

News September 18, 2025

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు డబుల్ బిల్లులు..!

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు డబుల్ బిల్లులు మంజూరయ్యాయి. లబ్ధిదారులకు రూ. లక్ష చొప్పున వారి ఖాతాల్లో జమ అయిన నాలుగు రోజుల తర్వాత తిరిగి అదే మొత్తాన్ని మరోసారి జమ చేశారు. ఈ విషయం గమనించిన గృహనిర్మాణ శాఖ అధికారులు డబుల్ బిల్లులు పొందిన లబ్ధిదారుల నుంచి డబ్బును రికవరీ చేసి, ప్రభుత్వ ఖాతాల్లో జమ చేయాలని స్థానిక ఏఈ, ఎంపీడీవోలను ఆదేశించారు.