News February 19, 2025

ఇలా చేస్తే మీ ఓటు చెల్లుబాటు కాదు: బాపట్ల కలెక్టర్

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లు అత్యంత జాగ్రత్తగా ఓటు వేయాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి జి. వెంకట మురళి చెప్పారు. ఓటర్లు ప్రథమ ప్రాధాన్యత ఓటును నమోదు చేయనట్లయితే వారి ఓటు చెల్లుబాటు కాదన్నారు. మంగళవారం ఓటింగ్ విధానంపై ఎన్నికల నిఘావేదిక వారు ప్రచురించిన కరపత్రాలను ఆయన కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఓటును అంకెలలో కాకుండా అక్షరాలలో నమోదు చేసినా కూడా ఆ ఓటు చెల్లుబాటు కాదన్నారు.

Similar News

News January 14, 2026

ఆమెకి రెండు యోనులు, రెండు గర్భాశయాలు

image

పుట్టుకతో రెండు యోనులు, రెండు గర్భాశయాలతో జన్మించిన యూపీలోని బల్లియా(D) యువతికి లక్నో వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు. ఆమెకి చిన్నప్పటి నుంచి మూత్ర విసర్జనపై నియంత్రణ ఉండేది కాదని, మలవిసర్జనలోనూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు డాక్టర్లు తెలిపారు. మూత్ర నాళాలు అసాధారణ ప్రదేశాలలో తెరుచుకోవడంతో మూత్రం లీక్ అయ్యేదని పేర్కొన్నారు. 3 సర్జరీలు చేసి ఈ అరుదైన సమస్యను పరిష్కరించారు.

News January 14, 2026

BREAKING.. నల్గొండ ఇక కార్పొరేషన్.. గెజిట్ విడుదల

image

నల్గొండ ఇకపై ‘మహానగర’ హోదాలో రూపాంతరం చెందనుంది. మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మారుస్తూ ప్రభుత్వం అధికారికంగా గెజిట్ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో పట్టణాభివృద్ధిలో నవశకం ప్రారంభం కానుంది. కార్పొరేషన్ హోదాతో అదనపు నిధులు రావడమే కాకుండా, రోడ్ల విస్తరణ, భూగర్భ డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కల్పనకు విస్తృత అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.