News February 19, 2025
కరీంనగర్: కాంగ్రెస్ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా..?

ఉమ్మడి KNR, ADB, NZB, MDK పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలుస్తుందా అని రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి జీవన్‌రెడ్డి గెలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ‘అల్ఫోర్స్’ అధినేత నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.
Similar News
News November 13, 2025
ఏలూరు జిల్లా వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు

ఏలూరు జిల్లా అంతటా పోలీసు బృందాలు బుధవారం రాత్రి వేళల్లో వాహనాలను తనిఖీ చేశాయి. గంజాయి, అక్రమ మద్యం, డ్రగ్స్ వంటి నిషేధిత వస్తువులు” రవాణా కాకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటూ జిల్లా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజల భద్రత కోసం ఈ తనిఖీలు కొనసాగనున్నాయని పోలీసులు తెలిపారు.
News November 13, 2025
గుడివాడకు జనవరి 12వ తేదీ నుంచి వందే భారత్ రైలు

చెన్నై-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవను గుడివాడ జంక్షన్, భీమవరం టౌన్ మీదుగా నరసాపురం వరకు జనవరి 12వ తేదీ నుంచి పొడిగిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విస్తరణతో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు ఇది ఎంతో ప్రయోజనకరం కానుంది.
News November 13, 2025
సిద్దిపేట: ఏడాదిలో 777 మైనర్ డ్రైవింగ్ కేసులు

సిద్దిపేట జిల్లాలో ఈ ఏడాది కాలంలో మొత్తం 777 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. విద్యార్థులు అధికంగా ఉండే స్కూళ్లు, కాలేజీల వద్ద ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మైనర్లు వాహనాలు నడుపుతున్నట్లు కనిపిస్తే వెంటనే అదుపులోకి తీసుకొని వాహనాన్ని సీజ్ చేస్తున్నారు. పట్టుబడితే మరుసటి రోజు తల్లిదండ్రులను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.


