News March 21, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

✓వివిధ శాఖలపై భద్రాద్రి, ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓ఖమ్మం జిల్లాలో ఓటు నమోదుపై ప్రత్యేక కార్యక్రమాలు
✓పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓సత్తుపల్లి మండలంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి పర్యటన
✓భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పర్యటన
Similar News
News April 15, 2025
KMM: నియోజకవర్గాలకు ప్రత్యేకాధికారుల నియామకం

ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల పటిష్ట అమలుకు నియోజకవర్గ ప్రత్యేక అధికారులను నియమించినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా.శ్రీజ తెలిపారు. ఖమ్మంకు జడ్పీ సీఈఓ దీక్షా రైనా, పాలేరుకు ఎస్డీసీ రాజేశ్వరి, మధిరకు జిల్లా పంచాయతీ అధికారిణి ఆశాలత, వైరాకు డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, సత్తుపల్లికి ఎల్.రాజేంద్ర గౌడ్ ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు పేర్కొన్నారు.
News April 15, 2025
నేలకొండపల్లి: చెట్టుకు ఉరేసుకుని విద్యార్థి సూసైడ్

నేలకొండపల్లిలో ఇంటర్మీడియట్ చదువుతున్న యశ్వంత్ ఓ వెంచర్‌లో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండల కేంద్రంలోని స్థానిక ఓ ప్రైవేట్ కాలేజీలో ఇటీవల ఇంటర్ పరీక్షలు రాశాడు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలం చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
News April 15, 2025
ఖమ్మం జిల్లాలో రాజీవ్ యువ వికాసానికి భారీగా దరఖాస్తులు

రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువు సోమవారం అర్ధరాత్రి ముగిసింది. ఈ పథకం కోసం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 91,816 దరఖాస్తులు వచ్చినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. మీసేవ సెంటర్ల వద్ద దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులతో పాటుగా వరుసగా వచ్చిన సెలవులతోఅభ్యర్థులు చాలావరకు సమస్యలు ఎదుర్కొన్నారు.