News February 19, 2025
MBNR: ఎముక గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి

పెళ్లిలో భోజనం చేస్తుండగా.. ఎముక ఇరుక్కుని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన బాలానగర్ మండల పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. MBNR మండలం దొడ్డలోనిపల్లికి చెందిన జహంగీర్(49) తిర్మలాయకుంటతండాలో ఓ పెళ్లికి వెళ్లాడు. భోజనం చేస్తుండగా.. గొంతులో ఎముక ఇరుక్కుని కిందపడిపోయాడు. అక్కడున్నవారు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News January 8, 2026
బాపట్లలో సాంప్రదాయ క్రీడా పోటీలు: కలెక్టర్

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ వీసీఎండీ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ సందర్భంగా ఈ నెల 10న సాంప్రదాయ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. బాపట్లలోని కేవీకే ఇండోర్ స్టేడియం, మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లలో పోటీలు నిర్వహిస్తామన్నారు. సంప్రదాయాలను యువతకు తెలియజేసి మానసిక ఉల్లాసం, దేహదారుఢ్యం పెంపొందించడమే లక్ష్యమని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు తెలిపారు.
News January 8, 2026
విజయ్ మూవీ వాయిదా.. టికెట్ మనీ రిఫండ్

తమిళ స్టార్ దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా సెన్సార్ కాకపోవడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే కొత్త రిలీజ్ తేదీని కూడా ప్రకటించకపోవడంతో BMS టికెట్లు కొన్నవారికి రిఫండ్ చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ రూపంలో అమ్ముడైన 4.5లక్షల టికెట్ల అమౌంట్‌ను తిరిగిచ్చేస్తోంది. దీంతోపాటు ప్రమోషన్లు, థియేటర్ల అగ్రిమెంట్ల రూపంలో మేకర్స్‌కు రూ.50కోట్ల వరకూ నష్టం వాటిల్లే అవకాశం ఉందని సమాచారం.
News January 8, 2026
ASF: హోమ్ గార్డులకు మెడికల్ ఇన్సూరెన్స్‌పై అవగాహన

జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో హోమ్ గార్డులకు మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. HDFC, AXIS బ్యాంకుల సహకారంతో ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత, ఆరోగ్య భద్రత, క్లెయిమ్ విధానాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, హోమ్ గార్డులు, బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.


