News February 19, 2025
GOOD NEWS.. ఆ రోజున అకౌంట్లోకి డబ్బులు

AP: BC, EWS కార్పొరేషన్లు మంజూరు చేసే స్వయం ఉపాధి రాయితీ రుణాలు ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అమలు కానుంది. ఈ జిల్లాల్లో 1.25 లక్షల BC, 45వేల EWS దరఖాస్తులు రాగా నిన్నటి నుంచి ఎంపిక ప్రారంభించారు. FEB 25లోగా లబ్ధిదారులను గుర్తించి కలెక్టర్ ఆమోదిస్తారు. MAR 8-12 వరకు ఆయా కార్పొరేషన్ల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుంది. MAR 17 నుంచి 20 మధ్య లబ్ధిదారులకు చేరుతుంది.
Similar News
News November 3, 2025
బస్సు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

మీర్జాగూడ <<18183773>>బస్సు<<>> ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో ప్రయాణికుల మృతి తీవ్రంగా కలచివేసిందని చంద్రబాబు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు పవన్ సైతం సానుభూతి ప్రకటించి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.
News November 3, 2025
ఈనెల 5న మెగా జాబ్ మేళా

AP: అనకాపల్లి జిల్లా చోడవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈనెల 5న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు హాజరుకావొచ్చు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఈ జాబ్ మేళాలో 18 మల్టీ నేషనల్ కంపెనీలు పాల్గొననున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు naipunyam.ap.gov.in వెబ్ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
News November 3, 2025
ఎటు చూసినా మృతదేహాలే..

TG: చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి <<18183773>>బస్సు<<>> ప్రమాద మృతుల బంధువుల ఆర్తనాదాలతో దద్దరిల్లిపోయింది. ఎటు చూసినా మృతదేహాలే కనిపిస్తుండడంతో ఆ ప్రాంతం శ్మశానాన్ని తలపిస్తోంది. ఆసుపత్రిలో సరిపడా బెడ్లు లేకపోవడంతో క్షతగ్రాతులను బెంచ్‌లపై పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురిని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. మరోవైపు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తారని సమాచారం.


