News February 19, 2025

గజపతినగరంలో వ్యక్తి అరెస్టు

image

ఓ చిట్ ఫండ్ కంపెనీలో లోన్ తీసుకుని సకాలంలో చెల్లించని వ్యక్తిని పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. విజయనగరంలోని ఓ ట్రాన్స్ పోర్ట్ చిట్ ఫండ్ కంపెనీలో గజపతినగరానికి చెందిన కొల్లా వెంకట సాయిరామ్ గతంలో తమ ఆస్తి పత్రాలను తనఖా పెట్టి లోన్ తీసుకున్నాడు. ఆ నగదును సకాలంలో చెల్లించకపోవడంతో విజయనగరం సివిల్ కోర్టు ఆదేశాల మేరకు సాయిరాంను అరెస్టు చేసి రిమాండ్ విధించినట్లు ఎస్ఐ లక్ష్మణరావు తెలిపారు.

Similar News

News February 22, 2025

VZM: అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

విజయనగరం జిల్లాలో టాయిలెట్లు, విద్యుత్ సౌకర్యం లేకుండా ఉన్న ప్రైవేటు భవనాల్లో ఉంటున్న అంగన్వాడీ కేంద్రాలను ఖాళీ చేయించాలని కలెక్టర్ అంబేద్కర్ అధికారులను ఆదేశించారు. వారిని కొత్త భవనాల్లోకి మార్చాలని విద్యుత్ శాఖా, విద్యాశాఖాధికారులకు ఆయన సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లోని మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయం లేని జాబితాను అందించాలన్నారు.

News February 21, 2025

విజయనగరం నుంచి కుంభమేళాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

image

మహా కుంభమేళాకు శుక్రవారం విజయనగరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి 70 మంది భక్తులతో రెండు సూపర్ లగ్జరీ బస్సులు బయలుదేరాయి. జిల్లా ప్రజా రవాణాధికారి సీ హెచ్. అప్పలనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. కుంభమేళా త్రివేణి సంగమం దర్శించుకుని 27వ తేదీన విజయనగరం చేరుకుంటారని డిపో మేనేజరు శ్రీనివాసరావు తెలిపారు. ఆర్టీసీ ఆదరించిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

News February 21, 2025

విజయనగరం జిల్లాలో బ‌ర్డ్ ఫ్లూ లేదు: జేడీ

image

విజయనగరం జిల్లాలో బర్డ్ ఫ్లూ లేదని పశుసంవర్ధక శాఖ జేడీ వైవీ రమణ స్పష్టం చేశారు. కోళ్ల ఫారాల్లో జీవ‌భ‌ద్ర‌త చ‌ర్య‌ల‌పై అవ‌గాహ‌న స‌ద‌స్సు శుక్రవారం నిర్వహించారు. ‘జిల్లాలో గుడ్లు, మాంసం ర‌వాణాపై ఎలాంటి ఆంక్ష‌లు లేవు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి ప్రయత్నిస్తున్నాం. అందరూ చికెన్, గుడ్లు తినవచ్చు’ అని జేడీ సూచించారు. డాక్టర్ మహాలక్ష్మి, డాక్టర్ ఎంబీవీ ప్రకాశ్ పాల్గొన్నారు.

error: Content is protected !!