News February 19, 2025
KCR అధ్యక్షతన సమావేశం.. ‘కారు’లన్నీ అటువైపే!

హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో బుధవారం సందడి వాతావరణం నెలకొననుంది. మధ్నాహ్నం రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం KCR అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. నగరంతో పాటు అన్ని జిల్లాల ముఖ్యనేతలు ఈ కార్యక్రమానికి తరలివెళ్తున్నారు. కారులన్నీ తెలంగాణ భవన్‌కు క్యూ కట్టాయి. భవిష్యత్తు కార్యాచరణపై HYD వేదికగా కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మీటింగ్ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.
Similar News
News November 4, 2025
BREAKING: జూబ్లీపోరులో BJPకి జనసేన సపోర్ట్

జూబ్లీహిల్స్ బైపోల్ వేడి తారస్థాయికి చేరింది. బీజేపీకి జనసేన పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు శంకర్‌గౌడ్ భేటీ అయ్యి, దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. తమ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా జనసేన నాయకులు ప్రచారంలో పాల్గొననున్నట్లు ఇరు పార్టీలు వెల్లడించాయి.
News November 4, 2025
నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్

నిరుపేదల సంక్షేమం కోసం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే లబ్ధిదారులను, అధికారులను ఆదేశించారు. మంగళవారం వాంకిడి మండలం జైత్పూర్ గ్రామంలో కొనసాగుతున్న పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఇందిరమ్మ పథకంలో ఈ గ్రామం మొదటి విడత మోడల్ గ్రామంగా ఎంపికైందని కలెక్టర్ తెలిపారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
News November 4, 2025
నిర్మల్: ఈనెల 6న వాహనాలకు వేలం

నిర్మల్ జిల్లాలో వివిధ ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు ఈనెల 6వ తేదీన గురువారం నిర్మల్ పట్టణ ఎక్సైజ్ కార్యాలయంలో వాహనాల వేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి అబ్దుల్ రజాక్ ఈరోజు తెలిపారు. 25 వాహనాలకు వేలం నిర్వహించనున్నామని, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


