News February 19, 2025
చిత్తూరు జిల్లాలో నేటి నుంచి ఆధార్ క్యాంపులు

చిత్తూరు జిల్లా పరిధిలో ఇవాళ్టి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ప్రతి మండలంలో సెలక్ట్ చేసిన సచివాలయాల్లో ఆధార్ సేవలు అందిస్తారు. కొత్తగా ఆధార్ కార్డు నమోదు, పాత కార్డులో వివరాల అప్‌డేట్, మొబైల్ లింకింగ్, చిన్న పిల్లల ఆధార్ నమోదు తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి. మీకు దగ్గరలోని సచివాలయాలను సంప్రదిస్తే.. ఏ సచివాలయంలో ఆధార్ సేవలు అందిస్తారో మీకు చెబుతారు.
Similar News
News March 14, 2025
చిత్తూరు: శక్తి టీంలను వెంటనే ఏర్పాటు చేయాలి

జిల్లా అంతట శక్తి టీంలను వెంటనే ఏర్పాటు చేయాలని ఎస్పీ మణికంఠ ఆదేశించారు. సిబ్బందితో నేర సమీక్ష సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్లతో నిఘా పెంచాలని సూచించారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలన్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలను చైతన్య పరచాలన్నారు. అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపాలన్నారు.
News March 13, 2025
మడగాస్కర్ అధ్యక్షుడుతో చిత్తూరు MP భేటీ

మడగాస్కర్ జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జస్టిన్ టోక్లే తన ప్రతినిధి బృందంతో భారత దేశానికి వచ్చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఢిల్లీలో పార్లమెంటు సమావేశ మందిరంలో లోకసభ స్పీకర్ ఓం బిర్లా, చిత్తూరు MP దగ్గుమళ్ల ప్రసాద్ రావుతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు.
News March 13, 2025
పెద్దిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

ఓ కేసు విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తిరుపతి M.Rపల్లి మారుతినగర్ పరిధిలో బుగ్గమఠం భూముల ఆక్రమణలపై వివరణ ఇవ్వాలని ఆ మఠం అసిస్టెంట్ కమిషనర్ ఈ నెల 7న నోటీసులు జారీ చేశారు. దీనిపై పెద్దిరెడ్డి హై కోర్ట్‌ను ఆశ్రయించారు. అయితే ఈ భూములకు చెందిన ఎలాంటి పత్రాలు పెద్దిరెడ్డి వద్ద లేవని, ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోమంటూ కోర్ట్ తేల్చి చెప్పింది.