News February 19, 2025

NLG: ఊపందుకున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు

image

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఊపందుకున్నది. ఈనెల 27న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ఉమ్మడి జిల్లాలో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. కాగా యూటీఎఫ్ తరఫున మరోసారి బరిలోకి దిగిన నర్సిరెడ్డికి వామపక్షాలు మద్దతిస్తున్నాయి.

Similar News

News January 13, 2026

కడప జిల్లాలో 99,508 హెక్టార్లలో రబీ పంటల సాగు

image

జిల్లాలో రబీ పంటల సాగు సాధారణ విస్తీర్ణం 1,39,796 హెక్టార్లు కాగా, ఈ ఏడాది
99,508 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. పప్పు సెనగ 68,207, మినుము 12,421, మొక్కజొన్న 5,390, వరి 4,223, జొన్న 2,110, కుసుమ 1.970, వేరుశనగ 1,259, గోధుమ 28, సజ్జ 783, రాగి 115, కొర్ర 81, కంది 143, పెసర 949, ప్రొద్దుతిరుగుడు 422, పత్తి 248 హెక్టార్లలో సాగయ్యింది. గత ఏడాది 1,10,776 హెక్టార్లలో సాగైనట్లు అధికారులు తెలిపారు.

News January 13, 2026

కడియం నర్సరీలలో మొక్కలతో సంక్రాంతి శోభ

image

కడియం పల్ల వెంకన్న నర్సరీలో మంగళవారం సంక్రాంతి సందడి నెలకొంది. పండుగను పురస్కరించుకుని మొక్కలతో రూపొందించిన ప్రత్యేక ఆకృతులు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. భోగి మంట, పాలకుండ, గాలిపటం, ఎద్దు, కోడిపుంజు వంటి పండుగ ప్రతీకలను సృజనాత్మకంగా తీర్చిదిద్దారు. సంక్రాంతి శోభను ప్రతిబింబిస్తున్న ఈ మొక్కల కళాఖండాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.

News January 13, 2026

సంగారెడ్డి: ‘నవజాత శిశు మరణాలు తగ్గించాలి’

image

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశు మరణాలు తగ్గించేలా చూడాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంత రావు అన్నారు. సంగారెడ్డిలోని కార్యాలయంలో వైద్యులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి 1,000 మంది శిశువుల్లో 18 మంది మరణిస్తున్నారని, ఆ సంఖ్య పదికి తగ్గించాలని సూచించారు. సమావేశంలో ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.