News February 19, 2025

సిద్దిపేటలో ప్రియుడితో కలిసి భర్త హత్యకు యత్నం

image

ప్రియుడితో కలిసి భర్త హత్యకు భార్య యత్నించింది. పోలీసుల వివరాలిలా.. సిద్దిపేటలోని గుండ్లచెరువు కాలనీ వాసికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి భార్యకు అదే కాలనీకి చెందిన శ్రవణ్‌తో వివాహేతర సంబంధం ఉంది. తమకు అడ్డుగా ఉన్న భర్త హత్యకు ప్రియుడితో కలిసి భార్య ప్లాన్ చేసింది. శ్రవణ్ తన స్నేహితులతో కలిసి 2సార్లు దాడి చేయగా భర్త ఇచ్చిన ఫిర్యాదుతో విచారించిన పోలీసులు శ్రవణ్‌ను రిమాండ్‌కు తరలించారు.

Similar News

News September 14, 2025

ASIA CUP: ట్రెండింగ్‌లో Boycott INDvPAK

image

ఆసియాకప్‌లో భాగంగా మరికొన్ని గంటల్లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో SMలో కొందరు ఇండియన్స్ BoycottINDvPAK హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. టెర్రరిస్టులతో క్రికెట్ వద్దు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచును చూడకుండా టీవీలు ఆఫ్ చేసి పహల్గామ్ దాడి బాధితులకు అండగా నిలవాలని కోరుతున్నారు. మరికొందరు క్రికెట్‌ను ఉగ్రవాదంతో ముడిపెట్టకూడదని అంటున్నారు. దీనిపై మీ కామెంట్?

News September 14, 2025

రాబోయే మూడు గంటల్లో బాపట్ల జిల్లాలో వర్షం

image

రాబోయే మూడు గంటలలో బాపట్ల జిల్లాలో వర్షం కురుస్తుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. గాలి వేగం గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల మధ్య ఉంటుందని, ప్రజలు సురక్షిత భవనాలలో రక్షణ పొందాలన్నారు. చెట్లు, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకుండా జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

News September 14, 2025

పెదాలు అందంగా ఉండాలంటే

image

పెదాలు అందంగా, తాజాగా ఉండాలంటే మీ స్కిన్‌కేర్‌లో లిప్ఆయిల్ యాడ్ చేసుకోవాల్సిందే. ఇది చూడటానికి లిప్‌గ్లాస్‌లా ఉంటుంది. దీనిలోని మాయిశ్చరైజింగ్ గుణాలు పెదాలు పగలకుండా చూస్తాయి. వీటిని లిప్‌స్టిక్‌కి జత చేస్తే పెదాలు ఎక్స్‌ట్రా షైనీగా ఉంటాయి. లిప్‌ఆయిల్స్‌లో ఉండే విటమిన్స్, ఫ్యాటీయాసిడ్స్ లిప్‌బామ్‌ కంటే ఎక్కువ హైడ్రేషన్‌ ఇస్తాయి. వీటిలో కూడా SPF ఉండేవి వాడితే యూవీ కిరణాల నుంచి పెదాలని రక్షిస్తాయి.